ఎవ్వరికైనా పాములంటే భయం ఉంటుంది. వాటిని దూరం నుంచి చూస్తే చాలు.. అక్కడ నుంచి ఠక్కున లగెత్తుతారు. ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్‌లో తరచూ పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. ఇంకొన్నింటిని చూస్తే మాత్రం భయందోళనలకు గురవుతాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
మురళీవాలే హౌస్లా అనే స్నేక్ క్యాచర్ సుమారు 12 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దాన్ని అడవిలో విడిచి పెడుతుండగా.. అది రివర్స్‌లో అతడ్ని కాటేయడానికి బుసలు కొడుతూ దూసుకొస్తుంది. అయితే స్నేక్ క్యాచర్ ఎక్కడా కూడా భయపడకుండా.. తగ్గేదేలే అన్నట్లుగా కింగ్ కోబ్రాను కంట్రోల్ చేస్తాడు. చివరికి అటవీ ప్రాంతంలో విడిచిపెడతాడు. కాగా, ఈ వీడియోను స్నేక్ క్యాచర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇప్పటిదాకా దీనికి 76 లక్షల వ్యూస్ రాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియో పాతదైనప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.