Viral Video: పెళ్లి విందులో రసగుల్ల లొల్లి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న చుట్టాలు! వీడియో వైరల్

పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి, నిబద్ధతకు ప్రతీక. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే వ్యక్తిగత బంధం మాత్రమే కాదు. మానవ సమాజానికి పునాదిగా నిలిచే అత్యంత సార్వత్రికమైన, ప్రాథమికమైన సామాజిక అనుబంధం కూడా. అయితే నేటి పెళ్లిళ్లు తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి తయారయ్యాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. సర్దుకుపోయేతత్వం, క్షమించే గుణం ఎవ్వరికీ సుతారం నచ్చడం లేదు..

Viral Video: పెళ్లి విందులో రసగుల్ల లొల్లి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న చుట్టాలు! వీడియో వైరల్
Bihar Rasgullas Fight At Wedding

Updated on: Dec 05, 2025 | 12:53 PM

బోధ్‌గయ, డిసెంబర్‌ 5: పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి, నిబద్ధతకు ప్రతీక. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే వ్యక్తిగత బంధం మాత్రమే కాదు. మానవ సమాజానికి పునాదిగా నిలిచే అత్యంత సార్వత్రికమైన, ప్రాథమికమైన సామాజిక అనుబంధం కూడా. అయితే నేటి పెళ్లిళ్లు తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి తయారయ్యాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. సర్దుకుపోయేతత్వం, క్షమించే గుణం ఎవ్వరికీ సుతారం నచ్చడం లేదు. తాజాగా ఓ పెళ్లి విందు జరుగుతుంది. అందులో అతిథులకు రసగుల్ల వడ్డిస్తుండగా.. కొందరికే అవి అందాయి. మిగతా అతిథులకు విందులో రసగుల్లా దొరకలేదు. అంతే.. పెళ్లి పందిరి పీకి నానా రబస చేశారు. అంతే.. పెళ్లి ఆగిపోయింది. ఈ విచిత్ర ఘటన గుజరాత్‌లోని బోద్‌గయాలో చోటుచేసుకుంది. వీళ్లు పొట్టుపొట్టుగా కొట్టుకున్న దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. వీడియో వైపు మీరూ ఓ లుక్కేసుకోండి..

బీహార్‌లోని బోధ్ గయలో ఓ హోటల్‌లో వివాహ వేడుక జరిగింది. వధూవరుల కుటుంబాలు అదే హోటల్‌లో బస చేశారు. అయితే అప్పటి వరకూ ఎంతో అప్యాయంగా పలకరించుకుంటూ ఉన్న అతిథులు ఒక్కసారిగా బద్ధ శత్రువులుగా మారిపోయారు. అందుకు కారణం పెళ్లి విందులో వడ్డించిన రసగుల్లా కారణం. విందులో స్వీట్లు అయిపోవడంతో వధువు, వరుడి తరపు కుటుంబాలు ఘర్షణ పడి చితక్కొట్టుకున్నారు. కుర్చీలు విసిరేస్తూ.. ఒకరి నొకరు తోసుకుంటూ.. కొట్టుకున్నారు. ఈ వివాహ ముచ్చట మొత్తం అక్కడి హోటల్ సీసీటీవీలో రికార్డైంది. అదికాస్తా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయింది. ఈ సంఘటన నవంబర్ 29న జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇరు కుటుంబాల గొడవతో పెళ్లి ఆగిపోయింది. ఈ పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. వధువు కుటుంబం వరుడి కుటుంబంపై వరకట్న కేసు నమోదు చేసింది. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాగా ఈ సంఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.