Viral Video: కారు సీటు కింద దాక్కున్న 15 అడుగుల కింగ్ కోబ్రా.. ఒక్క క్షణం ఉలిక్కిపడి..!

సాధారణంగా చిన్న పామును చూస్తేనే గుండె జారినంత పనవుతుంది. అదే కింగ్ కోబ్రా లాంటి విషసర్పాన్ని దగ్గర నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.?

Viral Video: కారు సీటు కింద దాక్కున్న 15 అడుగుల కింగ్ కోబ్రా.. ఒక్క క్షణం ఉలిక్కిపడి..!
Viral

Updated on: May 06, 2023 | 8:34 PM

ఈ మధ్యకాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా చిన్న పామును చూస్తేనే గుండె జారినంత పనవుతుంది. అదే కింగ్ కోబ్రా లాంటి విషసర్పాన్ని దగ్గర నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.? పైప్రాణం పైకే పోతుంది. ఈ కింగ్ కోబ్రా విషం.. క్షణాల్లో మనిషిని చంపేస్తుంది. తాజాగా ఓ కారు సీటు కింద దూరింది 15 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. దాన్ని చూడగానే ఒక్కసారిగా ఓనరు మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే తేరుకుని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. అతడు అక్కడికి చేరుకొని సుమారు 2 గంటల పాటు కష్టపడి.. ఆ పెద్ద కింగ్ కోబ్రాను చాలా శ్రమపడి మరీ పట్టాడు. ఆ తర్వాత తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.

దీనిపై తాజాగా ట్వీట్ చేశాడు ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద. ‘ప్రకృతి సమత్యులతను కాపాడుకోవడానికి ఆహార గొలుసులో కింగ్ కోబ్రా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ 15 అడుగుల కింగ్ కోబ్రాను రక్షించి, సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఇదంతా కూడా ట్రైన్‌డ్‌ స్నేక్ క్యాచర్స్ పర్యవేక్షణలో జరిగింది. స్వంతంగా ప్రయత్నించవద్దు. వర్షాల ప్రారంభంలో ఈ పాములు అనేక చోట్ల కనిపిస్తాయి’ అని సుశాంత నందా ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.