Oo Antava: ‘ఊ అంటావా’ పాటకు సానియా, సైనా, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ స్టెప్పులు.. మీరు చూశారా..?

|

Mar 06, 2023 | 4:43 PM

సొంతగడ్డ హైదరాబాద్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా కంటతడి పెట్టారు. 22 ఏళ్ల టెన్నిస్‌ కెరీర్‌కు ఆమె గుడ్‌బై చెప్పారు. సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ను చూడడానికి పలువురు సెలబ్రిటీలు తరలివచ్చారు.

Oo Antava: ఊ అంటావా పాటకు సానియా, సైనా, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ స్టెప్పులు.. మీరు చూశారా..?
Sania Mirza along with Yuvraj Singh, Irfan Pathaan, Farha Khan and Saina Nehwal can be seen grooving to the popular Telugu song ‘Oo Antava Oo Oo Antava’
Follow us on

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియామిర్జా తన చివరిమ్యాచ్‌లో కూడా ఘనవిజయం సాధించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం సానియా మీర్జా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌కు వేదికయ్యింది. డబుల్స్‌ మ్యాచ్‌ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరిగింది. సింగిల్స్‌లో రోహన్‌ బోపన్నపై విజయం సాధించారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో సానియా ఫైనల్‌ మ్యాచ్‌ను చూడడానికి పలువురు సెలబ్రిటీలు తరలివచ్చారు. టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా భావోద్వేగంతో కంటతడి పెట్టారు. సానియా మ్యాచ్‌ను వీక్షించడానికి పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌, క్రీడా, రాజకీయ ప్రముఖులు వచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

మ్యాచ్ అనంతరం సానియా ఫేర్‌వెల్ ఈవెంట్..  నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగింది.  ఫర్హా ఖాన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, తెలంగాణ మంత్రి కెటీ రామారావు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఇర్ఫాన్ పఠాన్, హుమా ఖురేషి, మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ దంపతులు, సైనా నెహ్వాల్, ఎఆర్ రెహమాన్, యువరాజ్ వంటి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. సానియా మీర్జా వీడ్కోలు ప్రసంగం నుంచి పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీల ఫోటోలు, డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సైనా నెహ్వాల్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో అయితే తెగ ట్రెండ్ అవుతుంది.

వీడియోలో, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఫర్హా ఖాన్, సైనా నెహ్వాల్‌లతో పాటు సానియా మీర్జా.. పుష్పలోని ‘ఊ అంటావా.. ఊహూ అంటావా’కి కాలు కదిపారు. వీడియోలో, ఫర్హా ఖాన్ తన చేతిలో మైక్ పట్టుకుని ఇర్ఫాన్ పఠాన్‌కు స్టెప్పులు నేర్పడానికి ప్రయత్నించడం చూడవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.