నాలుగు చేతుల్లో ఒకటే క్యాచ్.. ‘క్యా సీన్ హై’

మైదానంలో బ్యాట్స్‌మెన్‌ కొట్టిన బంతిని ఫీల్డర్లు పలు విధాలుగా క్యాచ్ పట్టడం మనం సాధారణంగా ప్రతి మ్యాచ్‌లోనూ చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల వైరల్‌ అయిన ఓ వీడియోలో క్యాచ్ అందరినీ ఆశ్చర్యపరిచారు ఇద్దరు ఫీల్డర్. ఆ వీడియో వివరాలు పూర్తిగా తెలీనప్పటికీ.. ఎక్కడో గుర్తు తెలియని ప్రదేశంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అందులో ఓ బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి.. బౌండరీలోకి వెళ్తుండగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు ఓ వ్యక్తి. ఆ తరువాత అది […]

నాలుగు చేతుల్లో ఒకటే క్యాచ్.. ‘క్యా సీన్ హై’
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 12:55 PM

మైదానంలో బ్యాట్స్‌మెన్‌ కొట్టిన బంతిని ఫీల్డర్లు పలు విధాలుగా క్యాచ్ పట్టడం మనం సాధారణంగా ప్రతి మ్యాచ్‌లోనూ చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల వైరల్‌ అయిన ఓ వీడియోలో క్యాచ్ అందరినీ ఆశ్చర్యపరిచారు ఇద్దరు ఫీల్డర్. ఆ వీడియో వివరాలు పూర్తిగా తెలీనప్పటికీ.. ఎక్కడో గుర్తు తెలియని ప్రదేశంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అందులో ఓ బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి.. బౌండరీలోకి వెళ్తుండగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు ఓ వ్యక్తి. ఆ తరువాత అది మళ్లీ బౌండరీలోకి పోతుందని భావించిన అతడు మళ్లీ దాన్ని గాల్లో నుంచే మైదానంలోకి విసిరాడు. దీంతో వెంటనే వెనకాల నుంచి వచ్చిన మరో ఫీల్డర్ క్యాచ్ అందుకొని బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేటి మేటి క్రికెటర్లారా.. దీన్ని గుర్తుంచుకొండి అని కామెంట్ పెట్టింది. కాగా ఇలాంటి క్యాచ్‌లు అంతర్జాతీయ టీ20 క్రికెట్ టోర్నీలో, ఐపీఎల్‌ల్లోనూ పలుమార్లు మనం చూసినప్పటికీ.. పెద్దగా ప్రాక్టీస్ లేని గల్లీ క్రికెటర్లు ఇలాంటి అద్భుతాలను చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

Latest Articles