10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో తప్పించుకున్న చిన్నారులు.. భయానక వీడియో వైరల్

|

Aug 01, 2023 | 12:13 PM

జూలై 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కానీ, లిఫ్ట్ నిర్వహణ ఏజెన్సీ, బిల్డర్, ఇతరులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే భవనంలో నివసిస్తున్న భరత్ చౌదరి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు అతని 11 ఏళ్ల కుమారుడు, భార్య అదే లిఫ్ట్‌లో ఉన్నారని వాపోయాడు.

10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో తప్పించుకున్న చిన్నారులు.. భయానక వీడియో వైరల్
Pune Lift
Follow us on

ఓ సొసైటీలో ఇద్దరు పిల్లలు బయటకు రాగానే 10వ అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడింది. జూలై 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ క్లిప్ చూసిన నెటిజన్లు సైతం భయపడిపోతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. ఈ క్లిప్ సొసైటీకి సంబంధించినది. ఇక్కడ భవనంలోని లిఫ్ట్‌లో పిల్లలు వెళ్తున్నారు. వారంతా లిఫ్ట్ నుండి బయటకు రాగానే, కొన్ని సెకన్ల తర్వాత లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సొసైటీ కేసు భవధాన్ ప్రాంతానికి చెందినదనది తెలిసింది. భవనంలోని 10వ అంతస్తులో ఉన్న లిఫ్టు నుంచి చిన్నారి, తల్లి కిందకు దిగిన వెంటనే లిఫ్ట్ డక్ట్ పిట్‌లో పడిపోయింది.

47 సెకన్ల నిడివి గల ఈ CCTV ఫుటేజ్ లో ఒక పిల్లవాడు లిఫ్ట్‌లో నిలబడి ఉన్నట్లు కనిపించింది. పక్కనే నిలబడి స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. క్షణాల్లోనే లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. ఇద్దరూ బయటికి వచ్చారు. దీని తరువాత లిఫ్ట్ తలుపులు మూసుకుపోయాయి. అంతలోనే పెద్దగా భయంకరమైన శబ్దం వచ్చింది. అంతే కాదు లిఫ్ట్‌లో వైబ్రేషన్ కూడా కనిపిస్తుంది. లిఫ్ట్ కింద పడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

జూలై 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను క్రైమ్ కంట్రోల్ రిఫార్మ్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా (@crocrimehq) అధికారిక హ్యాండిల్ జూలై 31న ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. క్యాప్షన్‌లో – పూణేలో 10వ అంతస్తు నుండి లిఫ్ట్ పడిపోయిందని, అది పడటానికి కొన్ని సెకన్ల ముందు పిల్లలు లోపల నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ క్లిప్‌ని సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తున్నారు. ఈ విషయంపై నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. హింజేవాడి పోలీసులు లిఫ్ట్ నిర్వహణ ఏజెన్సీ, బిల్డర్, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే భవనంలో నివసిస్తున్న భరత్ చౌదరి అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు అతని 11 ఏళ్ల కుమారుడు, భార్య లిఫ్ట్‌లో ఉన్నారని వాపోయాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..