
రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన జనాల్లో ఫోన్ వాడాలంటేనే భయం తెప్పిస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న మండోర్ వ్యవసాయ మార్కెట్‌లో ఒక వ్యాపారి జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. వ్యాపారి పని చేసుకుంటూ నిలబడి ఉండగా జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో.. అతని ప్యాంట్‌లోంచి ఒక్కసారిగా పొగ బయటకు వచ్చింది. అది క్షణాల్లోనే రూమ్ మొత్తం వ్యాపించింది.
పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన వ్యాపారి కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకొని అతన్ని దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు నిర్ధారించారు.
ఎక్కువ మంది చదివినవి: ఏసీ ఆన్ చేసిన వెంటనే ఏవో వింత శబ్ధాలు.. ఏంటని పైకి ఎక్కి చూడగా..
అయితే అతని ప్యాంట్‌లో ఫోన్ పేలిన దృశ్యాలు మొత్తం సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో చూసిన జనాలు షాక్ అయ్యారు. ఈ ఘటన తర్వాత చాలా మంది ఫోన్ వాడాలంటే భయంతో వణికిపోతున్నారు. అయితే తీవ్రమైన ఎండ వేడిమి వల్ల ఫోన్ అతిగా వేడెక్కడం.. లేదా బ్యాటరీలో ముందే ఉన్న సాంకేతిక లోపం వల్ల ఇది జరిగి ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వీడియో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.