Viral Video: లోకో భిన్న రుచి అన్నారు పెద్దలు. ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు.. రకరకాల అభిరుచులు.. అయితే కొంతమంది ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొత్తవాటిని చేయడం కోసం దైర్యంగా ముందుకువెళ్తారు. ఎంతటి ప్రమాదకమైన ఫీట్స్ నైనా చేయడానికి వెనుకాడరు. ఇలాంటి వారిని కొంతమంది పిచ్చి అని అంటారు. ఎందుకంటే ప్రజలు తమ జీవితాలను విభిన్నంగా చేసే ప్రక్రియలో ప్రమాదంలో పడుతుంటారు. చావుకు భయంలేకుండా తమ అభిరుచిని కొనసాగిస్తూనే ఉంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) అనేకం నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు వారు చేసే భయంకరమైన ఫీట్స్ తో మరణాన్ని కూడా పొందిన సంఘటనలున్నాయి. అయినప్పటికీ ప్రాణాలను లెక్క చేయకుండా కొంతమంది భయం కలిగించే ఫీట్స్ ను చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో కనిపించే సీన్ ను తలపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కదులుతున్న వాహనంపై నుంచి దూకడం సినిమాల్లో చాలా సన్నివేశాలు చూసి ఉంటారు.. అయితే రియల్ జీవితంలో ఇలాంటి ఇలాంటి విన్యాసాలు చేయడం చూశారా? లేదు, కానీ అలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ( Viral Video) జరుగుతోంది. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఖచ్చితంగా సినిమాల్లోని ప్రమాదకరమైన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి.
వీడియోలో ఓ పెద్ద గుంత ఉండడంతో పాటు అదే గొయ్యి వైపు ఓ కారు వేగంగా వస్తున్నట్లు చూడవచ్చు. కారు నడుపుతున్న వ్యక్తి గుంతలోకి రాకముందే అందులో నుంచి దూకాడు. ఆ తర్వాత కారు నేరుగా వెళ్లి గొయ్యిలోనే పడిపోతుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిటారుగా నిలబడే విధంగా కారు గొయ్యిలో పడిపోవడం. కదులుతున్న వాహనాన్ని గుంతలో పడేసి నిటారుగా నిలబడేలా చేయడం కూడా ఒక రకమైన కళే. దీనికి మంచి నైపుణ్యం అవసరం. వాహనం వేగం.. స్పీడ్ నియంత్రణ.. బ్యాలెన్సింగ్ వంటి అంశాలను పరిగణలో తీసుకుంటారు.
షాకింగ్ వీడియో:
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో radical4x4 అనే ID పేరుతో షేర్ చేయబడింది, దీనికి ఇప్పటివరకు 1.4 మిలియన్లు అంటే 14 లక్షల వీక్షణలు వచ్చాయి, అయితే 8 వేల మందికి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో, వీడియో చూసిన అనంతరం నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది డబ్బు వృధా అని ఒక యూజర్ కామెంట్ చేయగా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్టంట్ ఫెయిల్ అయిందని మరో యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.
Also Read: Chanakya Niti: సమాజంలో గౌరవ మర్యాదల పొందాలంటే.. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోలో చెప్పిన చాణక్య