Watch: గల గల పారుతున్న నదులు.. నిండుతున్న దృశ్యం ఎప్పుడైనా చూశారా..? పోటెత్తిన వరదతో..

|

Jul 06, 2023 | 10:36 AM

సాధారణంగా ఒక నది అనగానే భారీ నీటి ప్రవహం, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు నిండిపోయిన నీళ్లతో ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, కొన్ని నదులు కాలానుగుణంగా ప్రవహిస్తుంటాయి. అంటే వర్షాకాలంలో అవి నీటితో నిండిపోయి ఉంటాయి. తిరిగి కాలం అయిపోయాక అవి ఎండిపోతుంటాయి. వైరల్‌గా మారిన వీడియో క్లిప్‌ని చూసి జనాలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరు రాశారు

Watch: గల గల పారుతున్న నదులు.. నిండుతున్న దృశ్యం ఎప్పుడైనా చూశారా..? పోటెత్తిన వరదతో..
How Rivers Are Made
Follow us on

వర్షాకాలం అందరూ ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ప్రజలు రకరకాలుగా ఆనందిస్తారు. అదే సమయంలో ఇంద్రధనస్సు, పచ్చని చెట్లు, ప్రకృతి ప్రత్యేకమైన రంగులను చూసి ప్రకృతి ప్రేమికులు సంతోషిస్తుంటారు. భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు నిండుతున్నాయి. మీరు కూడా అలాంటి సీన్లు చాలానే చూసి ఉంటారు. అయితే నదీగర్భం వరద నీటితో నిండిపోవడం ఎప్పుడైనా చూశారా..? అలాంటిదే ఇక్కడో వీడియో వైరల్‌ అవుతోంది. పూర్తిగా ఎండిపోయి ఉన్న ఒక నది కళ్లముందే నిండుకోవటం కనిపించింది. మిమ్మల్ని మంత్రముగ్దులను చేసే ఈ దృశ్యాన్ని మీరే చూడండి..

ప్రకృతికి సంబంధించి ఇలాంటి మర్మమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇది కొద్ది మందికి మాత్రమే తెలుసు. నది, పర్వతం, అడవి అన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే, ఈ ప్రదేశాలకు దగ్గరగా ఉండటం అవసరం. అలాగే, వాటిని నిశితంగా అర్థం చేసుకోవడం, చదవడం అవసరం. చాలా మందికి ప్రకృతి అంటే అర్థం కాదు. అలాంటి వారు నది ఎలా ఏర్పడుతుందో ఎవరు పట్టించుకుంటారు? మీకు ఈ ఆలోచన ఉన్నప్పటికీ, ఈ అందమైన దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా ఊహించగలరా. ఇలాంటివి ఎవరూ చూసి ఉండరు. అయితే సోషల్ మీడియాలో అలాంటి దృశ్యమే కనిపించింది.

ఇవి కూడా చదవండి

IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ తన అధికారిక ఖాతా (@ParveenKaswan) నుండి ట్విట్టర్‌లో ఈ పోస్ట్‌ను షేర్‌ చేశారు. క్యాప్షన్‌లో ఇలా రాశారు..ఈ విధంగా నదులు తయారవుతాయని చెప్పారు. తామంతా ఉదయం 6 గంటలకు తమ టీంతో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఈ దృశ్యం కనిపించిందని చెప్పారు. కేవలం 1 నిమిషం 7 సెకన్ల నిడివి గల ఈ చిన్న క్లిప్‌లో నదీ గర్భం క్రమంగా నీటితో నిండిపోతుండటం చూడవచ్చు. ఇది కనుచూపుమేరలో నీటి ప్రవహం నదిలా రూపాతరం చెందింది.

సాధారణంగా ఒక నది అనగానే భారీ నీటి ప్రవహం, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు నిండిపోయిన నీళ్లతో ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, కొన్ని నదులు కాలానుగుణంగా ప్రవహిస్తుంటాయి. అంటే వర్షాకాలంలో అవి నీటితో నిండిపోయి ఉంటాయి. తిరిగి కాలం అయిపోయాక అవి ఎండిపోతుంటాయి. వైరల్‌గా మారిన వీడియో క్లిప్‌ని చూసి జనాలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకరు రాశారు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..