అమరవీరుడి చెల్లి పెళ్లి వేడుకలో అన్నగా బాధ్యత నిర్వహించిన జవాన్లు.. చూపరుల కంట తడి పెట్టిస్తోన్న వీడియో

' దేశ రక్షణలో తన ప్రాణాలను అర్పించిన అమర జవాన్ ఫ్యామిలీకి అండగా తోటి సైనికులు నిలిచారు. అమరవీరుడి సోదరి పెళ్ళికి అన్నీ తామై భాద్యతను నిర్వర్తించారు. సైనికులు సోదరుడి పాత్రను పోషించి వధువును వివాహ మండపానికి తీసుకెళ్లి, సోదరుడి పాత్రను నిర్వర్తించారు. తన పెళ్ళికి అన్న పాత్రలో వచ్చిన పెళ్లి జరిపించడంతో నవ వధువు భావోద్వేగానికి గురైంది. వివాహానికి హాజరైన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమరవీరుడి చెల్లి పెళ్లి వేడుకలో అన్నగా బాధ్యత నిర్వహించిన జవాన్లు.. చూపరుల కంట తడి పెట్టిస్తోన్న వీడియో
Himachal Soldiers Fulfilled Brother At Wedding (2)
Image Credit source: X

Updated on: Oct 04, 2025 | 11:25 AM

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సైనికులు ఒక యువతి వివాహంలో సోదరుడి పాత్ర పోషించడం ద్వారా తమ అమరవీరుడైన స్నేహితుడి విధిని నెరవేర్చారు. 2024లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన యుద్ధంలో తన సోదరుడిని కోల్పోయిన యువతి వివాహంలో సోదరుడి పాత్ర పోషించడానికి హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సైనికులు ముందుకొచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన వారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.

సిర్మౌర్, అక్టోబర్ 3వ తేదీ 2024లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన యుద్ధంలో తన అన్నయ్యను కోల్పోయిన యువతి వివాహంలో సోదరుడి పాత్ర పోషించడానికి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సైనికులు రంగంలోకి దిగారు. వధువు ఆరాధన.. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె అన్న ఆశిష్ కుమార్ లేడు అన్న లోటు తప్ప.. పెళ్లి వేడుక అత్యంత ఘనంగా సాంప్రదాయంగా జరిగింది.

ఇవి కూడా చదవండి

ఆశిష్ కుమార్ పనిచేసిన రెజిమెంట్ నుంచి సైనికులు, మరి కొంతమంది మాజీ సైనికులు సిర్మౌర్ జిల్లాలోని భర్లి గ్రామంలోని పెళ్ళికి హాజరయ్యారు. ఆరాధనకు ఆమె సోదరుడి పాత్రలో నిలిచి ఆమెను మంటపానికి తీసుకెళ్లి అన్నయ్య పాత్ర పోషించారు. ఈ సమయంలో వధువు తన అన్నయ్యను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. అమరవీరుడి సోదరుడి రెజిమెంట్ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సైనికులు కూడా వధువుతో పాటు ఆమె అత్తమామల ఇంటికి వెళ్లి, సోదరుడి బాధ్యతను పూర్తి చేశారు. ఈ దృశ్యం వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.

తమ ప్రేమకు .. తన తోటి సైనికుడి కుటుంబానికి మద్దతుకు చిహ్నంగా.. వారు ఆరాధనకు వివాహ ఆశీర్వాదంగా ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను కూడా బహుమతిగా ఇచ్చారు. ఆమె సోదరుడు మిగిల్చిన శూన్యాన్ని పూరించే భాద్యతను పూర్తి చేశారు. ఫిబ్రవరి 2024లో ఆపరేషన్ అలర్ట్ సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆశిష్ కుమార్ యుద్ధంలో మరణించాడు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..