యువకుడు తీసుకొచ్చిన సూట్ కేసు కదులుతూ కనిపించింది.. డౌట్ వచ్చి.. ఓపెన్ చేయగా..!

హర్యానాలో ఓ యువకుడి నిర్వాకం బయటపడింది. అతిగా కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు. ఒక విద్యార్థి ఒక అమ్మాయిని సూట్‌కేస్‌లో బాలుర హాస్టల్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్ చెకింగ్‌లో దొరికిపోయాడు. సోనిపట్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

యువకుడు తీసుకొచ్చిన సూట్ కేసు కదులుతూ కనిపించింది.. డౌట్ వచ్చి.. ఓపెన్ చేయగా..!
Student Tries Sneaking Girlfriend In Suitcase

Updated on: Apr 12, 2025 | 10:53 AM

హర్యానాలోని సోనిపట్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక విద్యార్థి ఒక అమ్మాయిని సూట్‌కేస్‌లో బాలుర హాస్టల్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. హాస్టల్ గార్డులు ఆనుమానంతో విద్యార్థిని ఆపి, లగేజ్ తెరుస్తుండగా అమ్మాయి కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అచ్చం ఒక సినిమా స్టైల్‌లో, ఒక విద్యార్థి ఒక అమ్మాయిని, బహుశా అతని స్నేహితురాలిని, అబ్బాయిల హాస్టల్‌లోకి దొంగతనంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన హర్యానాలోని సోనిపట్‌లోని ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, అతన్ని హాస్టల్ గార్డులు పట్టుకున్నారు. సూట్ ఈ సంఘటన కెమెరాకు చిక్కింది. అదే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అనుమానాస్పదంగా యువకుడు సూట్‌కేసు తీసుకుని వస్తుండగా, సెక్యూరిటీ గార్డులు ఆ సూట్‌కేస్‌ను తెరిచి చూశారు. దీంతో అందులో నుంచి ఓ యువతి బయటపడింది. తోటి విద్యార్థి ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డ్ చేశారు. అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది గుర్తించలేదు. ఆమె అదే విశ్వవిద్యాలయంలో చదువుతుందా లేదా బయటి నుండి వచ్చిందా అనేది స్పష్టత లేదు.

వీడియో చూడండి.. 

అయితే ఈ వీడియో Squint Neon @TheSquind ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు ఆమె ఆ అబ్బాయి స్నేహితురాలు అని పేర్కొన్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో ఒక మీమ్ ఫెస్ట్‌ను రేకెత్తిస్తోంది. ఈ మొత్తం సంఘటనపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కాగా, ఈ విషయంపై విశ్వవిద్యాలయం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆ జంటపై ఏదైనా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..