FIFA World Cup 2022: ఫీపా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో అరుదైన దృశ్యం.. అది కావాలంటూ అభిమానుల నినాదాలు..

ఫుట్ బాల్‌ ప్రియులకు పండుగ మొదలైంది. ఖతార్ వేదికగా ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ఈవెంట్ స్టార్ట్ అయింది. తొలి గేమ్‌లో అతిథ్య ఖతార్ పై ఈక్వెడార్ 2-0 తేడాతో గెలుపొందింది. ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు ఇరు దేశాల..

FIFA World Cup 2022: ఫీపా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో అరుదైన దృశ్యం.. అది కావాలంటూ అభిమానుల నినాదాలు..
Ecuador Fans

Edited By: Ravi Kiran

Updated on: Nov 22, 2022 | 8:35 AM

ఫుట్ బాల్‌ ప్రియులకు పండుగ మొదలైంది. ఖతార్ వేదికగా ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ఈవెంట్ స్టార్ట్ అయింది. తొలి గేమ్‌లో అతిథ్య ఖతార్ పై ఈక్వెడార్ 2-0 తేడాతో గెలుపొందింది. ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు ఇరు దేశాల క్రీడాభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోయింది. తమ దేశ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ.. అభిమానులంతా సందడి చేశారు. సాధారణంగా ఏదైనా ఆటలో తమ జట్టు గెల్చినప్పుడు ఎగిరి గెంతడం, తమ అభిమాన జట్టు, క్రీడాకారులకు అనుకూలంగా నినాదాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. క్రికెట్‌లో అయితే బౌండరీలు కొట్టినప్పుడో, వికెట్లు తీసినప్పుడో గట్టిగా అరుస్తూ.. ఆ ప్లేయర్‌కు అనుకూలంగా నినాదాలిస్తారు. మరికొంతమంది అయితే ఫ్లకార్డులు చేతబూని తమ అభిమానాన్ని చాటుకుంటారు. కాని ఫిఫా వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో మాత్రం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈక్వెడార్ అభిమానులంతా తమ కు బీర్ కావాలంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాధారణంగా ఫుట్‌బాల్ లేదా మెగా ఈవెంట్స్ జరిగేటప్పుడు పరిమితులకు లోబడి బీర్, అల్కహల్ విక్రయించడం సర్వసాధారణం. విదేశాల్లో క్రికెట్ మ్యాచ్‌లు లేదా ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో అల్కహల్ తాగుతూ అభిమానులు కనిపిస్తూ ఉంటారు.

ఫిఫా వరల్డ్ కప్‌ నేపథ్యంలో స్టేడియంలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఖతార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ప్రతిస్పందనగా ఈక్వెడార్ అభిమానులు “క్వెరెమోస్ సెర్వేజా”(మాకు బీర్ కావాలి) అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీడియో ఈక్వెడార్ అభిమానులు స్టాండ్‌లలో “క్వెరెమోస్ సెర్వేజా, క్వెరెమోస్ సెర్వేజా అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. టోర్నమెంట్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ఖతార్ లోని క్రీడా మైదానాల్లో సాధారణ సీటింగ్ విభాగాలలో మద్యం అమ్మకాలను నిషేధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈక్వెడార్ అభిమానులు మాత్రం చాలా సేపు తమకు బీర్ కావాలంటూ నినాదాలను హోరెత్తించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..