Viral Video: దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ అంతే!

Hero Dog Fights Leopard to Save Child: తరచూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే జనాల దృష్టికి ఆకర్తిస్తాయి. తాజా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ట్రెడింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో ఓ బాలుడిని కాపాడేందుకు శునకం తన ప్రాణాలను సైతం అడ్డేయడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

Viral Video: దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ అంతే!
Dog Vs Leopard Viral Video

Updated on: Jul 02, 2026 | 11:26 AM

విశ్వాసం.. అనగానే మన మైండ్‌లో మెదిలే పేరు, చిత్రం శునకానిదే. ఇవి తమ యజమనాలకు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క పూట తిండి పెడితే చాలు.. ఎప్పుడూ వారి వెంటనే ఉంటూ.. వారికి ఏదైనా ఆపద వస్తే.. వాటి ప్రాణాలు సైతం అడ్డుపెట్టి ముందుండి పోరాటు తాయి. అచ్చం అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఒక ఇంటి కాంపౌండ్‌ వాల్‌లో ఇంటికి బయట చిన్న పిల్లాలడు కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు.. అతని పక్కనే ఒక పెంపుడు కుక్క కూడా కూర్చొని ఉంది. ఇంతలో ఒర చిరుతపులి.. మెల్లగా కాంపౌండ్ వాల్‌పైకి ఎక్కి ఇంటి వరండాలోకి దూకింది. మెళ్లగా బాలుడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. సామాన్యం చిరుత పులి వంటి క్రూరమైన జంతువును చూస్తే.. కుక్కలు సైతం కొన్ని సార్లు వెనకడుగు వేస్తాయి. కానీ ఇక్కడ ఉన్న శునకం మాత్రం ఆ పని చేయలేదు.

తన యజమాని కుమారుడికి ఎలువంటి హాని కలగకుండా చూసేందుకు.. ఏకంగా ఆ చిరుతపులినే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. తన ప్రాణాలు సైతం అడ్డేసి.. చిరుతపులికే చుక్కలు చూపించింది. దీంతో ఆ చిరుతపులి బాలుడిని కనీసం టచ్‌ కూడా చేయలేకపోయింది. చాలా సేపు ప్రయత్నించినా.. దాని ఆ శునకం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ చిరుత అక్కడి నుంచి వెను తిరిగి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ దృశ్యాలన్నీ.. అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు ఆ శునకంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కదా విశ్వాసం అంటే.. అందుకే అంటారు.. ఈ విశ్వంలో శునకానికి మించిన విశ్వాసపాత్రులు ఎవరూ ఉండరని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది ఏఐ వీడియో అంటూ కామెంట్స్ చేశారు.

వీడియో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us