Viral Video: ఇలాంటి దృశ్యాలు లైఫ్‌లో చూసి ఉండరు.. ఎవరెస్ట్‌ శిఖరం డ్రోన్‌ వీడియో

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరంకు సంబంధించిన ఇలాంటి విజువల్స్ మీరు లైఫ్‌లో చూసి ఉండరు. చైనాకి చెందిన డ్రోన్‌ తయారీ సంస్థ డీజేఐ గ్లోబల్‌.. అద్భుతమైన దృశ్యాలను క్యాప్యూర్ చేసింది. ఈ వీడియో చూసిన వారెవరైనా వావ్ అనాల్సిందే.

Viral Video: ఇలాంటి దృశ్యాలు లైఫ్‌లో చూసి ఉండరు.. ఎవరెస్ట్‌ శిఖరం డ్రోన్‌ వీడియో
Mount Everest

Updated on: Jul 13, 2024 | 9:22 AM

మౌంట్‌ ఎవరెస్ట్‌, ఈ పేరు చెబితేనే ఓ అందమైన లోకం కళ్ల ముందు కదలాడుతుంది. ఎవరెస్ట్‌ అందాలను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం. దేవలోకం భుమిపైకి దిగి వచ్చిందా అన్నట్టు ఉంటుంది ఎవరెస్ట్‌ అందాలు. అందుకే, ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి తరలివస్తుంటారు పర్యాటకులు. అయితే, మౌంట్‌ ఎవరెస్ట్‌ అందాలను ఇంతవరకు ఎవరూ చూపించనివిధంగా కెమెరాల్లో బంధించింది చైనాకి చెందిన డ్రోన్‌ కంపెనీ డీజేఐ గ్లోబల్‌.

డ్రోన్‌ సాయంతో మౌంట్‌ ఎవరెస్ట్‌ను చిత్రీకరించింది డీజేఐ గ్లోబల్‌ కంపెనీ. ఆ దృశ్యాలను చూస్తే మైండ్‌బ్లాక్‌ అయ్యేలా ఉన్నాయ్‌. ఇంతవరకు ఎప్పుడూ చూడని అద్భుత లోకం అందులో కనిపించింది. మౌంట్‌ ఎవరెస్ట్‌పైన పరిస్థితులన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించాయ్‌ ఆ వీడియోలో. ఆ దృశ్యాలను చూసినవారంతా వారెవ్వా ఎవరెస్ట్‌ అంటున్నారు.

సముద్రమట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ నుంచి డ్రోన్‌ను ప్రయోగించారు. అక్కడి నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ.. అక్కడి దృశ్యాలను డ్రోన్‌ చిత్రీకరించింది. ఎవరెస్టు శిఖరం ఎక్కుతున్న వారిని, దిగుతున్నవారిని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా శిఖరానికి సమీపంలో ఉన్న హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కనులవిందు చేస్తున్నాయి.

డ్రోన్‌ విజువల్స్‌లో… మౌంట్‌ ఎవరెస్ట్‌ అందాలు చూడతరమా అన్నట్టు ఉన్నాయ్‌. కనుచూపుమేర ఎటుచూసినా పాల కడలి లాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయ్‌. మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కుతోన్న ట్రెక్కర్స్‌ కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నారు. పర్వతాల కింద నుంచి శిఖరాగ్రం వరకు మొత్తం కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలుగా పేరుగాంచిన మౌంట్‌ ఎవరెస్ట్‌… భారతదేశానికే తలమానికంగా ఉన్నాయ్‌. మంచుతో కప్పబడి ఎంతో అందంగా ఉండే ఈ పర్వతాలను నిత్యం వేలాదిమంది అధిరోహిస్తూ ఉంటారు. అయితే, మౌంట్‌ ఎవరెస్ట్‌పై ట్రెక్కింగ్‌ చాలా కష్టమైన పని. అందుకే చాలామంది దూరం నుంచే చూసి తమ ఆనందాన్ని తీర్చేసుకుంటారు. అలాంటివారికి ఈ వీడియో అబ్బురపరుస్తోంది.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..