ఇది పక్షికాదు బకాసురుడు.. పొట్ట పిడికెడు.. ఆకలి ఘనం..

పక్షి, జంతువుల వీడియోలు ఎప్పుడూ చూడడానికి సరదగా ఉంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో రెండు బతికి ఉన్న చేపలని ఒక పక్షి ఒకదాని తర్వాత ఒకటి గుటుక్కున మింగేసింది. చూడడానికి పిట్ట పొట్ట కొంచెం ఉంది.. కానీ అంత పెద్ద చేపలు ఎలా తినేసి అని చూపరులు ఆశ్చర్యపోతున్నారు.

ఇది పక్షికాదు బకాసురుడు.. పొట్ట పిడికెడు.. ఆకలి ఘనం..
Viral Video

Updated on: Sep 25, 2025 | 2:08 PM

సోషల్ మీడియాలో ఒక పక్షి వీడియో ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఆ చిన్న పక్షి కి ఉంది పొట్టా.. లేక చెరువా అని ప్రజలు సరదాగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. తెల్ల పక్షి ఒకేసారి రెండు పెద్ద చేపలను తిన్నట్లు కనిపిస్తుంది. ఆ పక్షి కొన్ని సెకన్లలో లోపులో చేపలను గుటుక్కున మింగేసింది. ఆ పక్షి కడుపు ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.. ఎందుకంటే ఆ పక్షి పొట్ట గుప్పెడంత కూడా లేదు. దానిలోపల అంత పెద్ద పెద్ద చేపలు ఎలా సరిపోయి ఉంటాయి అని అనుమానం వస్తుంది చూసిన వారికి ఎవరికైనా.. ఓ తెల్ల పక్షి మొదట ఒక చేపని తన ముక్కులో నొక్కి ఒకేసారి మింగినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీని తర్వాత అది రెండవ చేపను అదే విధంగా మింగుతుంది.

రెండు చేపలను గుటకాయస్వాహ చేసిన పక్షి

ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో @AMAZlNGNATURE అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో ఒక చిన్న ఎర్రటి తొట్టిలో రెండు బతికి ఉన్న చేపలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఒక తెల్ల పక్షి వచ్చి మొదట ఒక పెద్ద చేపని పట్టుకుని టక్కున మింగేసింది. తర్వాత మళ్ళీ కడుపు ఖాళీ అనిపించింది ఏమో.. తొట్టిలో ఉన్న రెండో చేపని కూడా చకచకా భుజించేసింది. ఈ రెండు చేపలు బతికే ఉన్నాయి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

లక్షలాది మంది ఆ వీడియోను చూశారు

ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది పక్షి తినే శైలిని ప్రశంసించారు. కొంతమంది వినియోగదారులు పక్షిని అద్భుతంగా అభివర్ణించారు. చాలామంది దాని ఆధారంగా మీమ్స్ కూడా సృష్టించారు. ఒక వినియోగదారు “ఇది కడుపునా లేదా బ్లాక్ హోలా?” అని రాశారు మరొక వినియోగదారు “నేను పక్షి ఆకలిని చూసి ఆశ్చర్యపోయాను” అని రాశారు.

మరిన్ని వైరల్ వీడియో న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..