Viral Video: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు యదేచ్ఛగా చొరబాట్లు.. వైరల్ వీడియోపై రచ్చరచ్చ

|

Jul 29, 2024 | 11:39 AM

భారతదేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించవచ్చులో తెలియజేస్తున్న బంగ్లాదేశ్ యూట్యూబర్ కి సంబంధించిన పాత వీడియో మళ్ళీ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో భద్రతా ఆందోళనలను ట్రిగ్గర్ చేస్తుంది. ఇటీవల 'DH ట్రావెలింగ్ ఇన్ఫో' అనే బంగ్లాదేశ్ యూట్యూబర్ కి చెందిన ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, యూట్యూబర్ భారతదేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించవచ్చో వివరంగా వివరిస్తున్నాడు.

Viral Video: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు యదేచ్ఛగా చొరబాట్లు.. వైరల్ వీడియోపై రచ్చరచ్చ
Bangladeshi Youtuber Old Video
Follow us on

భారత దేశం సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లపై తరచుగా ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నయి. మనదేశంలో అడ్డదారుల్లో అక్రమంగా అడుగు పెట్టి.. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రతాదళాలు దాటుకుని ఎలా మనదేశంలోకి అడుగు పెడుతున్నారు అని ఆలోచిస్తుంటే.. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో మళ్ళీ చక్కర్లు కొడుతోంది. భారతదేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించవచ్చులో తెలియజేస్తున్న బంగ్లాదేశ్ యూట్యూబర్ కి సంబంధించిన పాత వీడియో మళ్ళీ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో భద్రతా ఆందోళనలను ట్రిగ్గర్ చేస్తుంది. ఇటీవల ‘DH ట్రావెలింగ్ ఇన్ఫో’ అనే బంగ్లాదేశ్ యూట్యూబర్ కి చెందిన ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, యూట్యూబర్ భారతదేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించవచ్చో వివరంగా వివరిస్తున్నాడు. ఇంకా ఈ వీడియోలో భారత దేశంలోకి ప్రవేశించడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్, వీసా,యు పాస్‌పోర్ట్ అవసరం లేదని ఆ వ్యక్తి నిర్మొహమాటంగా వెల్లడించాడు.

అంతేకాకుండా యూట్యూబర్ భారతదేశంలోకి అడుగు పెట్టే రహదారిని కూడా ప్రదర్శిస్తున్నాడు. ఈ మార్గంలో వెళ్లే వ్యక్తులు కొన్ని పర్యవసానాలను ఎదుర్కొంటారని తెలిపాడు. అంటే BSF అధికారుల దెబ్బను రుచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంకా వీడియోలో భారతదేశంలో BSF శిబిరాన్ని ప్రదర్శించాడు. భారతదేశంలోకి ప్రవేశించగల కొన్ని సొరంగాలను బహిర్గతం చేశాడు. వీడియోను ముగిస్తూ ఇలా అక్రమంగా భారత దేశంలోకి ప్రవేశించి బంగ్లాదేశ్ ప్రతిష్టను నాశనం చేయవద్దని.. అక్రమంగా ఎవరైనా ఇతర దేశంలోకి ప్రవేశించడం సరికాదని ఆ యుట్యుబర్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ వీడియో జిస్ట్ ప్లాట్‌ఫారమ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికీ సుమారు 2 లక్షల మంది చూశారు. దాదాపు 7,000 మంది ఇష్టపడ్డారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోకు ప్రతికూలంగా ప్రతిస్పందించారు.. సరిహద్దు దగ్గర కాపలా ఉన్న ‘BSF మీద నిద్రపోతోందా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. యూట్యూబర్‌కి మార్గం తెలిస్తే, అందరికీ తెలుసు. కనుక సరిహద్దు వద్ద ఇంతకాలం బీఎస్ఎఫ్ ఏం చేస్తోందని అని కామెంట్ చేస్తున్నారు.

మరొకరు వ్యంగ్యంగా మా దేశంలోకి అడుగు పెట్టడానికి వీసాలు, పాస్‌పోర్ట్‌లు అవసరం లేదు. సొరంగం దాటిన తర్వాత, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు మార్కెట్ లో అమ్ముడవుతాయి. రండి.. మీరు వాటిని సేకరించి మీ ఓటు వేసి డ్యూటీ చేయండి అంటూ తన భాదను వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అయితే మూడవ వినియోగదారు అతను చూపించినందుకు థాంక్స్.. ఇప్పుడు మనం ఈ స్థానాలను బలోపేతం చేయవచ్చు అని పాజిటివ్ గా స్పందించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..