Tiger Rare Video: ఇది చాలా రేర్ వీడియో..అమ్మ ముందు పులి పిల్లల అల్లరి మాములుగా లేదు..

అడవుల్లో జంతువులు, వాటి జీవన శైలికి సంబధించిన వీడియోలను అటవీ అధికారులు ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. అలాంటిదే ఒక IFS అధికారి షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోని దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులో ఓ తల్లి పులి ఎదుట దాని పిల్లలు చేస్తున్న అల్లరి కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Tiger Rare Video: ఇది చాలా రేర్ వీడియో..అమ్మ ముందు పులి పిల్లల అల్లరి మాములుగా లేదు..
Cute Tiger Cubs Playing

Updated on: Jun 19, 2025 | 5:41 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువులకు సంబంధించినవి కొన్ని ఉంటే.. పాములు, పక్షులు, పెంపుడు జంతువులు, మన చుట్టుపక్కల జరిగే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌, మరికొన్ని షాకింగ్‌ సంఘటనలు కూడా చాలానే కనిపిస్తుంటాయి. అయితే, అప్పుడప్పుడు అడవుల్లో సఫారీకి వెళ్లిన వారు కూడా తమ అనుభవాలను నెట్టింట షేర్‌ చేస్తుంటారు. అలాగే, అడవుల్లో జంతువులు, వాటి జీవన శైలికి సంబధించిన వీడియోలను అటవీ అధికారులు ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. అలాంటిదే ఒక IFS అధికారి షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. అందులో ఓ తల్లి పులి ఎదుట దాని పిల్లలు చేస్తున్న అల్లరి కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఒక IFS అధికారి సోషల్ మీడియాలో షేర్‌ చేసినట్టుగా తెలిసింది. ఇందులో పచ్చని పచ్చిక బైయళ్లపై ఒక తల్లి పులి హాయిగా పడుకుని ఉండగా, దాని పిల్లలు మూడు కలిసి ఆడుకుంటున్నాయి. అమ్మ ఎదురుగా అవి చేస్తున్న అల్లరినంతా వీడియో తీసిన అధికారులు షేర్ చేశారు. కాగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన ఈ వీడియోలోని దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎంతటి క్రూర మృగాలైనా వాటి పిల్లలు కలిసి ఆడుకుంటుంటే చూసేందుకు.. అదొక ముచ్చటైన దృశ్యమేనంటూ చాలా మంది నెటిజన్లు వీడియోపై స్పందించారు. అభయారణ్యాల్లో పులుల్ని సంరక్షిస్తూ వాటి పెరుగుదల కోసం శ్రమిస్తున్న ఫారెస్ట్ అధికారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..