Viral Video: ‘నేను ఎక్కడికి వెళ్లను.. నా బిడ్డతో ఇక్కడే ఉంటా’ – కంటతడి పెట్టిస్తోన్న ఆ తండ్రి వీడియో

' నేను ఎక్కడికీ వెళ్లను. నా కుమారుడి సమాధితో పాటు ఇక్కడే ఉంటా. ఏ తండ్రికి, తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు' అంటూ ఓ తండ్రి కుమారుడి సమాధి వద్ద పడుకుని బోరున విలపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హసన్ జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి భూమిక్ ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు.

Viral Video: నేను ఎక్కడికి వెళ్లను.. నా బిడ్డతో ఇక్కడే ఉంటా - కంటతడి పెట్టిస్తోన్న ఆ తండ్రి వీడియో
Grieving Father

Updated on: Jun 08, 2025 | 6:04 PM

“ఇలాంటి విషాదం ఏ తల్లిదండ్రులకు రాకూడదు” అంటూ కుమారుడి సమాధి వద్ద రోదిస్తూ కన్నీరు మున్నీరవుతున్న ఓ తండ్రి వీడియో హృదయాలను కదిలిస్తోంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఆయన కుమారుడు భూమిక్ ప్రాణాలు కోల్పోయాడు. హసన్ జిల్లా కుప్పగోడు గ్రామానికి చెందిన భూమిక్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన భూమిక్.. అక్కడ జరిగిన తోక్కిసలాటలో మరణించాడు. మూడో రోజు కర్మ కార్యక్రమాల అనంతరం కుమారుడి సమాధి వద్ద విలపించిన లక్ష్మణ్.. “ఈ స్థలం బిడ్డ భవిష్యత్తు కోసం ఉంచాను. కానీ ఇక్కడే అతన్ని సమాధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

లక్ష్మణ్ కుటుంబం గత 20 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తూ చిన్న పరిశ్రమ నిర్వహిస్తోంది. హసన్‌లో ఉన్న భూమిని భూమిక్ భవిష్యత్ కోసం ఉంచగా.. ఇప్పుడు అదే స్థలంలో అతడ్ని సమాధి చేయాల్సి వచ్చింది.

ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఉచిత పాస్‌లు పొందే క్రమంలో జరిగిన తోపులాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా… అనేక మంది గాయపడ్డారు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..