Viral Video: విమానాన్ని అడ్డుకున్న పావురాలు… దెబ్బకు ఫ్లైట్‌ను రివర్స్‌ చేసిన పైలట్‌

విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ అనేది పైలట్స్‌కు సవాల్‌తో కూడుకున్న పని. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా, పక్షుల లాంటివి ఏమైనా అడ్డుపడినా ఎంతో డేంజర్‌. ఒక్కోసారి విమానాలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి పక్షులు చనిపోయి.. విమానాలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి...

Viral Video: విమానాన్ని అడ్డుకున్న పావురాలు...  దెబ్బకు ఫ్లైట్‌ను రివర్స్‌ చేసిన పైలట్‌

Updated on: May 29, 2025 | 4:32 PM

విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ అనేది పైలట్స్‌కు సవాల్‌తో కూడుకున్న పని. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా, పక్షుల లాంటివి ఏమైనా అడ్డుపడినా ఎంతో డేంజర్‌. ఒక్కోసారి విమానాలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి పక్షులు చనిపోయి.. విమానాలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టేకాఫ్‌ అవుతున్న విమానాన్ని రెండుసార్లు ఆపేశాయి పావురాలు. అవును, ఏకంగా ఫ్లయిట్‌లోని క్యాబిన్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో విమానాన్ని నిలిపివేశారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మాడిసన్‌, విస్కాన్సిన్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌-2348లో జరిగింది.

కాసేపట్లో విమానం బయలుదేరుతుందనగా క్యాబిన్‌లో ఓ పావురాన్ని ప్రయాణికుడు గుర్తించాడు. వెంటనే విమానం సిబ్బందికి తెలిపాడు. దీంతో కొంతసేపు విమానాన్ని నిలిపివేశారు. గ్రౌండ్‌ సిబ్బంది వచ్చి, ఆ పావురాన్ని బయటకు పంపించారు. ఇక విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా, మరో పావురం క్యాబిన్‌లో ఎగురుతూ కనిపించింది. దీంతో మరోసారి ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించారు. వెంటనే విమానాన్ని నిలిపివేసిన సిబ్బంది రెండో పావురాన్ని కూడా బయటకు సురక్షితంగా తీసుకెళ్లారు. దీంతో విమాన ప్రయాణానికి 56 నిమిషాల ఆలస్యం అయింది. మరోసారి క్యాబిన్‌ చెక్‌ చేసుకొని అనంతరం విమానం బయల్దేరింది.

వీడియో చూడండి: