Viral Video: ఆకాశంలోకి ఎగిరిన బెలూన్‌లో అగ్నిప్రమాదం… ఇద్దరి ప్రాణాలు కాపాడిన వ్యక్తి చివరికి…

మెక్సికోలోని జకాటెకాస్‌లో బెలూన్‌ పండగలో విషాదం చోటు చేసుకుంది. నగరంలో నిర్వహించిన తొలి బెలూన్ ఫెస్టివల్ సందర్భంగా ప్రమాదం సంభవించింది. ఆకాశంలో ఎగిరిన బెలూన్‌లో అగ్రిప్రమాదం జరిగింది. గాలి బెలూన్ మంటల్లో చిక్కుకోవడంతో భయానక దృశ్యంగా మారింది. ఈ ప్రమాదంలో 40 ఏళ్ల...

Viral Video: ఆకాశంలోకి ఎగిరిన బెలూన్‌లో అగ్నిప్రమాదం... ఇద్దరి ప్రాణాలు కాపాడిన వ్యక్తి చివరికి...
Hot Hair Balloon Fire

Updated on: May 15, 2025 | 4:27 PM

మెక్సికోలోని జకాటెకాస్‌లో బెలూన్‌ పండగలో విషాదం చోటు చేసుకుంది. నగరంలో నిర్వహించిన తొలి బెలూన్ ఫెస్టివల్ సందర్భంగా ప్రమాదం సంభవించింది. ఆకాశంలో ఎగిరిన బెలూన్‌లో అగ్రిప్రమాదం జరిగింది. గాలి బెలూన్ మంటల్లో చిక్కుకోవడంతో భయానక దృశ్యంగా మారింది. ఈ ప్రమాదంలో 40 ఏళ్ల లూసియో ఎన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.

కాలిన్ రగ్ అనే వ్యక్తి తన X లో పోస్ట్ చేసిన వీడియోలో లూసియో ప్రాణాంతకంగా పడిపోవడానికి ముందు బెలూన్ నుండి వేలాడుతూ జరిగిన సంఘటనలకు సంబంధించిన దృశ్యాలను చూపించింది. సంఘటన వివరాలను పంచుకుంటూ రగ్ దానికి “RIP” అని శీర్షిక పెట్టారు. ఎన్రిక్ ఎస్ట్రాడా ఫెయిర్‌గ్రౌండ్స్‌లో ఇదంతా జరిగింది,

బెలూన్‌ ఫెస్టివల్‌లో భాగంగా రంగురంగుల బెలూన్‌లు ఆకాశంలోకి ఎగిరాయి. కానీ ఒక బెలూన్ గాలిలో ఎగురుతున్న సమయంలో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో బెలూన్‌లో లూసియోతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అప్పటి వరకు సంతోషంగా ఎగిరిన వారంతా మంటలు వ్యాపించడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన లూసియో ధైర్యంగా వ్యవహరించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు వ్యాపించడంతో, అతను ఇద్దరు ప్రయాణీకులను ప్రమాదం నుండి సురక్షితంగా బయటకు పంపించాడు. అప్పటికే బెలూన్‌బుట్ట మొత్తం మంటల్లో కాలిపోవడంతో లూసియో అక్కడే చిక్కుకుపోయాడు.

 

వీడియో చూడండి:

 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో లూసియో బెలూన్‌ తాళ్లను పట్టుకుని వేళాడుతున్నట్లు కనిపించింది. కొంతసేపటి తర్వాత, అతను పడి ప్రాణాలు కోల్పోయాడు. లూసియో మృతదేహాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిని మిగిలిన ఇద్దరు ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

“తొలి బెలూన్ ఫెస్టివల్ సమయంలో… వేడి గాలి బెలూన్‌లో జరిగిన దురదృష్టకర సంఘటన తర్వాత ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము” అని సెక్రటరీ జనరల్ రోడ్రిగో రేయెస్ ముగుర్జా అన్నారు.