Viral Video: నడిరోడ్డు మీద భర్తను చితక్కొట్టిన భార్య… విషయం తెలిసి జారుకున్న స్థానికులు

ఒక మహిళ తన భర్తను నడిరోడ్డు మీద చితక్కొట్టింది. తన సంపాదనతో తేరగ తిని ఇంట్ల పండుకుంటున్నడని గల్లా పట్టి చెంపలు వాయించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై నెటిజన్స్‌ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పురుషలకు కూడా భరణం...

Viral Video: నడిరోడ్డు మీద భర్తను చితక్కొట్టిన భార్య... విషయం తెలిసి జారుకున్న స్థానికులు
Wife's Public Slap On Joble

Updated on: Apr 10, 2025 | 9:01 PM

ఒక మహిళ తన భర్తను నడిరోడ్డు మీద చితక్కొట్టింది. తన సంపాదనతో తేరగ తిని ఇంట్ల పండుకుంటున్నడని గల్లా పట్టి చెంపలు వాయించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై నెటిజన్స్‌ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పురుషలకు కూడా భరణం కోరడానికి న్యాయవ్యవస్థ అనుమతించాలని నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియోలో ఉన్నదాని ప్రకారం తన భర్త పనిక వెళ్లకుండా తన సంపాదనను ఖర్చు పెడుతున్నాడని ఆ మహిళ అరుస్తున్నట్లు వినబడింది. ఆమె అతని కాలర్ పట్టుకుని, అతనిపై కేకలు వేసి, అతనిని చాలాసార్లు చెంపదెబ్బ కొట్టింది. అయితే కొంతమంది స్థానికులు చూస్తూ జోక్యం చేసుకోలేదు. భార్య కొడుతున్నా కూడా భర్త మాత్రం రివర్స్‌ ఏమనకుండా మౌనంగానే ఉండిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు నెటిజన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది.

జంటల మధ్య తగాదాలు ఎల్లప్పుడూ ఉండేవే. కానీ బహిరంగంగా గొడవలు పడటం మంచిది కాదంటున్నారు నెటిజన్స్‌. మహిళ దూకుడును చూసి కొందరు ఆశ్చర్యపోయారు. అతన్ని బహిరంగంగా అవమానించే హక్కు ఆమెకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. భారతీయ న్యాయ వ్యవస్థ భర్తలకు కూడా అలాంటి సందర్భాలలో భరణం కోరుకోవడానికి అనుమతిస్తుందని నేను భావిస్తున్నానని రాసుకొచ్చాడు.

వీడియో చూడండి: