VIRAL VIDEO : హైదరాబాద్‌లో ఘరానా పిక్ పాకెటర్స్..! పర్సు ఎలా కొట్టేస్తున్నారో వీడియోలో చూడండి..

VIRAL VIDEO : హైదరాబాద్‌లో పిక్‌పాకెటర్స్‌ ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. బస్సులు, ట్రైన్స్‌, పబ్లిక్‌ ప్లేస్‌లు కాకుండా ఇప్పుడు

VIRAL VIDEO : హైదరాబాద్‌లో ఘరానా పిక్ పాకెటర్స్..! పర్సు ఎలా కొట్టేస్తున్నారో వీడియోలో చూడండి..
Pick Pocket

Edited By: uppula Raju

Updated on: Jul 10, 2021 | 6:03 AM

VIRAL VIDEO : హైదరాబాద్‌లో పిక్‌పాకెటర్స్‌ ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. బస్సులు, ట్రైన్స్‌, పబ్లిక్‌ ప్లేస్‌లు కాకుండా ఇప్పుడు అంత్యక్రియల దగ్గర కూడా చేతివాటం చూపిస్తున్నారు. బంధువుల ముసుగులో అంత్యక్రియలకు వెళ్లి నగదు, మొబైల్స్‌ దోచుకుంటున్నారు. సాయం చేస్తున్నట్టు నటించి జేబులు ఖాళీ చేస్తు్న్నారు. విలువైన ఫోన్లు, నగదు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా లంగర్‌హౌస్‌లో ఓ చావు ఇంటికి వెళ్లిన ఓ పిక్ పాకెటర్స్ తన చేతివాటం చూపించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఇప్పుడవి సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

వీడియోలో ఓ మృతదేహాన్ని బంధువులందరు కలిసి వ్యాన్‌లో ఎక్కించే ప్రయత్నం చేస్తుంటారు. అందరు గుంపుగా వెళ్లి తలో చేయి వేసి బాడీని పైకి లేపుతారు. అయితే ఉన్నట్టుండి పొట్టిగా ఉన్న ఓ వ్యక్తి ఆ గుంపులోకి చొరబడతాడు. బాడీని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న ఓ వ్యక్తి చొక్కా జేబులో చేయిపెట్టి పర్సు కొట్టేస్తాడు. అతడిని నలుపు రంగు షర్ట్ వేసుకున్న మరో వ్యక్తి కవర్ చేస్తూ ఉంటాడు. పని అయిపోయాక అక్కడక్కడే తిరుగుతూ ఎవ్వరికి అనుమానం రాకుండా మెల్లగా స్కూటీపై జారుకుంటారు. అయితే ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ విషయం బయటపడింది.

లంగర్ హౌస్‌లో జరిగిన ఈ చోరీలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా నగరంలో ఇలాంటి చోరీలు అధికంగా జరుగుతున్నాయి. పిక్‌పాకెటర్స్ టీమ్‌గా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. అంత్యక్రియలు, పెళ్లిళ్లు వంటి గుంపుగా ఉండే కార్యక్రమాలకు హాజరై తమ స్టైల్‌లో చేతివాటం చూపిస్తున్నారు.

TCS JOBS : ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. TCS లో 40 వేల ఉద్యోగ అవకాశాలు.. త్వరలో నియామకాల ప్రక్రియ..

Hyderabad : టిమ్స్‌లో శవాల సొమ్ము కాజేస్తున్న దొంగలు..! ఎవరో కాదు ఆస్పత్రిలో పనిచేసేవారే..

Income Tax Department Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 155 పోస్టులు..