
జూపార్కుల్లో గొరిల్లాలు చేసే వింత వింత పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. గొరిల్లా విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఫీలింగ్స్ అనేటివి మనుషుకే కాదు జంతువులకు సైతం ఉంటాయని ఓ ఆడ గొరిల్లా నిరూపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఆడవారి విషయంలో మగవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది లేదంటే చీరి చింతకు కడతారు. ఇక్కడో ఆడ గొరిల్లా కూడా మగ గొరిల్లాను అదే పని చేసింది. ఈ వీడియో చేసిన నెటిజన్స్ తెగ నవ్వేసుకుంటున్నారు.
కొందరు జంతు ప్రేమికులు అటవీ ప్రాంతంలోని సఫారీకి వెళ్లారు. అక్కడో మహిళకు ఎదురైన వింత అనుభవం ఇది. ఒక మహిళ మగ గొరిల్లా వద్దకు వెళ్లి దానితో ముచ్చట పెడుతున్నట్తుగా ఉంది. వెంటనే ఆ గొరిల్లా ఆమె జుట్టు పట్టుకున్నది. చాలా సేపటి వరకు మహిళ జుట్టు వదలడం లేదు. దూరంగా ఉన్న ఆడ గొరిల్లా ఇది చూసి దొర్లుతూ అక్కడకు వచ్చింది. ఆడగొరిల్లా సీరియస్‌గా చూడటంతో భయంతో మగ గొరిల్లా మహిళ జుట్టును విడిచిపెట్టింది. అనంతరం మగ గొరిల్లాను ఆడగొరిల్లా పక్కకు గుంజుకుపోయి దొర్లించి దొర్లించి కొట్టింది. ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది.
Male Gorilla grabs Girls Hair, Gets Beaten by his Female Gorilla 🤣 pic.twitter.com/uZG5Fo3gqG
— Rosy (@rose_k01) July 11, 2025
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్స్ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘జాతులతో సంబంధం లేదు. మహిళలు దీనిని ఎప్పుడూ సహించరు’ అని ఒకరు పోస్టు పెట్టారు. ‘అన్ని జాతులు ఒకేవిధంగా ప్రవర్తిస్తాయి. మగవారు సరసాలాడటం ఆపలేరు, ఆడవారు అసూయపడటం ఆపలేరు’ అని మరొకరు రాశారు. మహిళా గెరిల్లాలు కూడా తమ భాగస్వామి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తాయని ఒకరు చమత్కరిస్తూ పోస్టు పెట్టారు.