Viral Video: భారతీయ బైకర్‌ను తాలిబాన్‌ ఆపాడు.. ఆ తరువాతి సీన్‌ సూపర్బ్‌… ఆఫ్గానిస్తాన్‌ చెక్‌పోస్టు వద్ద ఇండియన్స్‌కు రెస్పెక్ట్‌ చూడండి…

ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన ఒక వైరల్ వీడియో నెటిజన్స్‌ హృదయాలను గెలుచుకుంటోంది. తాలిబాన్ భద్రతా సిబ్బంది ఒక భారతీయ పర్యాటకుడిని ఎలా ఆప్యాయంగా చూసుకున్నారో ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో పాస్‌పోర్ట్ తనిఖీ కోసం ఒక సాధారణ చెక్ పోస్ట్ వద్ద మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న భారతీయుడిని తాలిబాన్‌ ఆపడం...

Viral Video: భారతీయ బైకర్‌ను తాలిబాన్‌ ఆపాడు.. ఆ తరువాతి సీన్‌ సూపర్బ్‌... ఆఫ్గానిస్తాన్‌ చెక్‌పోస్టు వద్ద ఇండియన్స్‌కు రెస్పెక్ట్‌ చూడండి...
Taliban Stops Indian

Updated on: Oct 09, 2025 | 7:32 PM

ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన ఒక వైరల్ వీడియో నెటిజన్స్‌ హృదయాలను గెలుచుకుంటోంది. తాలిబాన్ భద్రతా సిబ్బంది ఒక భారతీయ పర్యాటకుడిని ఎలా ఆప్యాయంగా చూసుకున్నారో ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో పాస్‌పోర్ట్ తనిఖీ కోసం ఒక సాధారణ చెక్ పోస్ట్ వద్ద మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న భారతీయుడిని తాలిబాన్‌ ఆపడం చూపిస్తుంది.

అతను ఏ దేశానికి చెందినవాడని అడిగినప్పుడు, బైకర్ ఇండియా అని సమాధానం ఇచ్చాడు. భద్రతా సిబ్బంది వెంటనే నవ్వి, “ఇండియా-ఆఫ్గానిస్తాన్ బ్రదర్” అని చెప్పి అతన్ని స్వాగతించారు. వారు అతనిని టీ కూడా అడిగారు. అతని పత్రాలను తనిఖీ చేయకుండానే అతన్ని కాబుల్‌ వెళ్ళడానికి అనుమతించారు. ఈ చర్య ఆన్‌లైన్‌లో వేలాది మందని కట్టిపడేస్తుంది. చాలామంది దీనిని భారతదేశం సద్భావన, ఆఫ్గానిస్తాన్‌తో దీర్ఘకాల సంబంధాల ప్రతిచర్యగా అభివర్ణించారు.

వీడియో చూడండి:

ఈ వీడియోపై నెటిజన్స్‌ స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు. ఈ గౌరవం కష్టపడి సంపాదించినది. భారత విదేశాంగ విధానం సరైన మార్గంలో ఉన్నదని చూపిస్తుందని పోస్టు పెట్టారు. భారతదేశం ఇప్పుడు ఆఫ్గానిస్తాన్‌ను పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించాలంటూ చాలా మంది ఇండియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే, కొంతమంది వినియోగదారులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తానీలు భారతీయులుగా నటించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని, భద్రతా తనిఖీలను దాటవేయకూడదని అన్నారు.