అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. సన్యాసం తీసుకుని ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఎంపీగా ఎంపికయ్యి.. అనంతరం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు యోగి ఆదిత్యనాథ్. రౌడీల పాలిట సింహ స్వప్నంగా నిలుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ తనదైన శైలిలో పాలన చేస్తున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వన్యప్రాణులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్‌కు అమితంగా ఇస్టం. తాజాగా,సీఎం యోగి.. ఓ పిల్లితో ముచ్చటిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో.. యోగి ఆదిత్యనాథ్ సోఫాలో కూర్చున్న పిల్లితో సరదాగా ముచ్చటించారు. క్యా కుచ్ ఖయేగీ? అ ని సీఎం యోగి ఆ పిల్లిని అడగడం వీడియోలో వినబడుతుంది. సోఫాలో కూర్చున్న పిల్లి యోగి నిశితంగా గమనిస్తుండగా అతను చాలాసార్లు ఇలా అడుగుతుండటం వీడియోలో కనిపించింది.
#योगी आदित्यनाथ और बिल्ली का वीडियो हुआ सोशल मीडिया पर वायरल
#योगी आदित्यनाथ सौफे पर बैठी बिल्ली से बोलते हुए दिखे @myogiadityanath pic.twitter.com/YqHwS2u9f2
— PRIYA RANA (@priyarana3101) January 19, 2023
ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొందరు వ్యక్తులు.. యోగి ఆదిత్యనాథ్- పిల్లి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..