Viral Video: ఓర్నీ.. స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం ఇంత ఈజీనా…?

|

Jul 20, 2024 | 12:11 PM

ఎన్ని సార్లూ , ఎన్ని సంవత్సరాలు.. ఈ టిప్ తెలియక కాళ్లకు గాయాలు చేసుకున్నాం. ఇకపై నో వర్రీ.. స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం డెడ్ ఈజీ. ఈ బాబాయ్ చూపించిన టిప్ ఫాలో అయితే లేడీస్ కూడా ఈజీగా స్కూటీ సెంటర్ స్టాండ్ వేయగలరు...

Viral Video: ఓర్నీ.. స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం ఇంత ఈజీనా...?
Scooter Centre Stand
Follow us on

స్కూటీలు గతంలో మహిళలు ఎక్కువగా వాడేవారు. ఎలక్ట్రిక్ స్కూటీలు వచ్చిన తర్వాత.. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉండదు కాబట్టి.. అందరూ వాటినే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే స్కూటీలు బరువుగా ఉంటాయి కాబట్టి సెంటర్ స్ట్రాండ్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.  ముఖ్యంగా మహిళలకు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. నిలువు స్టాండ్ వేసే క్రమంలో కొందరికి కాళ్లకు గాయాలు కూడా అవుతుంటాయి. ఇకపై అంతలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. దానికోసం.. ఓ ఈజీ ట్రిక్ చూపించి.. అందర్ని ఆశ్చర్యపరిచాడు ఈ వ్యక్తి.

ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ముందుగా సైడ్ స్టాండ్ వేయాలి. ఆపై సైడ్ స్టాండ్ వేసిన వైపే.. స్కూటీని బాగా వంచితే… సెంటర్ స్టాండ్‌ను వేయడానికి కావాల్సిన స్పేస్ దొరుకుతుంది. ఆ వెంటనే.. సెంటర్ స్టాండ్‌ను కిందకి దించితే సరిపోతుంది. ఇలా చేస్తే… సెకన్ల వ్యవధిలోనే కష్ట పడకుండా స్యూటీ సెంటర్ స్టాండ్ వేయొచ్చు. ఈ వీడియో ప్రజంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘ఇన్నాళ్లు ఈ టిప్ తెలియక తెగ కష్టపడ్డాం.. ఇకపై రెచ్చిపోతాం’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘బాబాయ్ నువ్వు కేక.. పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా ఈ ఐడియా వచ్చి ఉండదు’ అని మరొకరకు వ్యాఖ్యానించారు. వీడియో దిగువన చూడండి….

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..