Viral Video: ఈ చేప నటన చూస్తే పగలబడి నవ్వుకోవడం ఖాయం… ఆస్కార్‌ అవార్డ్‌ కూడా తక్కువే అంటున్న నెటిజన్స్‌

మనుషులే కాదు.. మేము కూడా నటలనో ఏమాత్రం తీసిపోము అంటూ కొన్ని రకాల జంతులు అప్పుడప్పుడు తమాషా చేస్తుంటాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట త్వరగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్‌ పగలబడి...

Viral Video: ఈ చేప నటన చూస్తే పగలబడి నవ్వుకోవడం ఖాయం... ఆస్కార్‌ అవార్డ్‌ కూడా తక్కువే అంటున్న నెటిజన్స్‌
Fish Acting Performance

Updated on: Oct 15, 2025 | 2:53 PM

మనుషులే కాదు.. మేము కూడా నటలనో ఏమాత్రం తీసిపోము అంటూ కొన్ని రకాల జంతులు అప్పుడప్పుడు తమాషా చేస్తుంటాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట త్వరగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్‌ పగలబడి నవ్వుకుంటున్నారు. ఆ వీడియోలో ఒక చేప తన నటన విశ్వరూపం చూపించింది. చేప నటనను చూసిన నెటిజన్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు.

నీటిలో ఒక నకిలీ పామును చేప ముందు ఉంచినప్పుడు చేప భలే నటించింది. అది తన ప్రాణానికి నిజమైన ప్రమాదం ఉన్నట్లుగా స్పందించి, తనను తాను రక్షించుకోవడానికి చనిపోతున్నట్లు నటించడం ప్రారంభించింది. ఈ దృశ్యం ఒక సినిమా కంటే తక్కువేమీ కాదంటూ నెటిజన్స్‌ స్పందిస్తున్నారు. అయితే, ఈ వీడియో AIని ఉపయోగించి సృష్టించబడినట్లుగా తెలుస్తోంది.

వీడియో చూడండి:

వీడియోలో నీటిలో తేలియాడే చేప అకస్మాత్తుగా ఒక నకిలీ పామును చూసినప్పుడు, అది నిజమైన పాముగా భావించి అక్కడే ఆగిపోతుంది. తర్వాత ఒక క్షణంలో అది అకస్మాత్తుగా పైకి దూకి వెల్లకిలా తిరిగి చనిపోయినట్లు కనిపిస్తుంది. తరువాత నకిలీ పాము ముందుకు కదులుతున్నప్పుడు చేప నిటారుగా ఉండి మెరుపు వేగంతో పారిపోతుంది. ఈ నాటకాన్ని చూస్తిన నెటిజన్స్‌ పగలబడి దొర్లుకుంటూ నవ్వుకుంటున్నారు. ఈ చేప నటనకు ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని కూడా చెబుతున్నారు.

ఈ 17 సెకన్ల వీడియోను ఇప్పటికే 2.7 మిలియన్ సార్లు వీక్షించారు, 40,000 మందికి పైగా దీన్ని లైక్ చేసి, రకరకాల ఫన్నీ రియాక్షన్‌లను ఇచ్చారు. “ఈ చేప నటన తరగతులు తీసుకుని ఉండాలి” అని అంటున్నారు. “నేను ఇంత వాస్తవికంగా స్పందించే చేపను ఎప్పుడూ చూడలేదు” అని మరికొందరు కామెంట్స్‌ పెడుతున్నారు.