Viral Video: మనసుంటే మార్గం ఉంటుంది.. ఈ సామెత ను నిజం చేస్తూ.. రోజు అనేక సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు.. వాటిని అధిగమించడానికి తమ ఆలోచనలకూ పదును పెడతారు. ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, గందరగోళానికి గురికాకుండా కొంచెం సేపు ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక మార్గం కనిపిస్తుంది. సకాలంలో ఆలోచిస్తే.. క్లిష్ట పరిస్థితిని కూడా పరిష్కరించుకోగలం. సమస్య ఏర్పడినప్పుడు.. సమయానుకూలంగా ఆలోచిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇదే విషయాన్నీ తెలియజేస్తూ.. ఓ వీడియో వైరల్ (Video Viral) అవుతోంది. ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడు.. మార్గ మధ్యలో రోడ్డు నీరుతో నిండిపోయి ఉంది. అయితే ఆ సైక్లిస్ట్ నీరు నిండిన గ్రామ రహదారిని దాటిన విధానం అందరినీ ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ వీడియోని అందరూ ఎంతో ఉత్సుకతతో, ఆశ్చర్యంతో చూస్తున్నారు.
వర్షం కురిసి బురదమయమైనా రోడ్డు మీద నడవనికి సర్వసాధారణంగా ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే బురద కాలికి తగులుతూ చికాకు పెడుతుంది. దీంతో రోడ్డు మీద నీరు నిల్వ ఉంటె.. ఆ ప్రాంతం నుంచి వెళ్లాలంటే.. అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతున్నా.. కాలికి బురద తగులుతుంది. ఇక సైకిల్ వంటి వాహనాలు తో బురద ఉన్న రోడ్లు దాటాలంటే.. అది మరింత కష్టం. బురద నీటిలో సైకిల్ కదలడం కష్టం. అయితే ఓ వ్యక్తి మాత్రం తన సైకిల్ తో సహా రోడ్డు మీద ఉన్న బురద నీటిని తెలివిగా దాటాడు.
దీనికి సంబంధించిన వీడియో ఐపీఎస్ అధికారిణి స్వాతి లాక్రా తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈ 15 సెకన్ల క్లిప్‌లో, సైకిల్ తొక్కుతున్న సైకిలిస్ట్ కనిపించాడు. సైకిల్‌పై ఉన్న మెటీరియల్ కింద పడకుండా, తమ శరీరాన్ని సైకిల్ ను సరి సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ .. అతను రోడ్డు దాటిన తీరు నిజంగా చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
Caption this! pic.twitter.com/hk4htXsk73
— Swati Lakra (@SwatiLakra_IPS) March 23, 2022
ఈ వీడియో ట్విటర్‌లోనే కాకుండా ఫేస్‌బుక్‌తో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో కూడా షేర్ చేయబడింది.
Also Read: Petrol Price Today: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్‌తో పోటీపడుతోన్న డీజిల్..
Bandla Ganesh: ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. నువ్వు సూపరన్న అంటున్న నెటిజన్ల