Viral Video: పక్షవాతానికి గురైన అనాథ గున్న ఏనుగు కథ చాలా స్ఫూర్తిదాయకం.. వీడియో వైరల్..

|

Nov 03, 2021 | 8:30 AM

Viral Video: ఏనుగులు, ముఖ్యంగా గున్న ఏనుగుల వీడియోలను ఎప్పుడూ ఏ సమయంలో చూసినా సరదాగా ఉంటాయి. మనసుకి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి..

Viral Video: పక్షవాతానికి గురైన అనాథ గున్న ఏనుగు కథ చాలా స్ఫూర్తిదాయకం.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

Viral Video: ఏనుగులు, ముఖ్యంగా గున్న ఏనుగుల వీడియోలను ఎప్పుడూ ఏ సమయంలో చూసినా సరదాగా ఉంటాయి. మనసుకి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. తాజాగా షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ గున్న ఏనుగు వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. పక్షవాతానికి గురైన కెరియో అనే అనాథ ఏనుగు పట్టుదలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సర్వసాధారణంగా మనిషికే చిన్న చిన్న కష్టాలు వస్తే.. ఆందోళనకు గురవుతారు. మరికొందరు అయితే చిన్న చిన్న సమస్యలకు భయపడి జీవితం నుంచి పారిపోతారు. ఇక ఏదైనా వ్యాధి బారినపడితే.. తమ జీవితం ఇక ఇంతే అంటూ నిరాశ నిస్పృహలకు గురవుతూ కాలం గడిపేస్తారు. అలాంటిది ఒక చిన్న జంతువు అనాథ ఏనుగు పిల్ల కెర్రియో మాత్రం తనకు వచ్చిన వ్యాధిని ఎంతో నిబ్బరంగా ఎదుర్కొంటుంది. తన కాళ్లకు వచ్చిన పక్షవాతాన్ని జయించి నడిచే దిశగా ప్రయత్నిస్తుంది. గున్న ఏనుగు తన సంరక్షకుని సాయంతో పక్షవాతాన్ని జయించడానికి ప్రయత్నిస్తుంది. నడవటానికి ప్రయత్నించి.. చివరకూ ఇప్పుడుసక్సెస్ అయింది. కెర్రియో ఉక్కు సంకల్పడానికి పక్షవాతం కూడా పరాయి అయింది. తన కాళ్ళను స్వాధీనంలోకి తెచ్చుకుని నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించి విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదే వీడియోకి “జీవితాన్ని కొనసాగించాలనే కెర్రియో యొక్క ఉక్కు సంకల్పం స్ఫూర్తిదాయకం. ఈ అనాథ ఏనుగు వెనుక కాళ్లకు పక్షవాతం రావడంతో రక్షించబడింది. రోజులు గడిచేకొద్దీ గున్న ఏనుగు శక్తిని పొంది.. తన కాళ్ళతో నడవడానికి ప్రయత్నిస్తుంది అనే క్యాప్షన్ పెట్టారు. ఈ కెరియో క్యూట్‌నెస్‌కి, సంకల్పానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. వేలాదిగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోకి జీవితాన్ని కొనసాగించాలనే దీని సంకల్పం గొప్పది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:   ముక్కు దిబ్బడ, నోటి పూత వంటి వాటికి నిమ్మరసం, మిరియాలు, ఉప్పుతో చెక్ పెట్టండి ఇలా..