Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్‌ చూసి చెప్పుతీసిన పెళ్లికూతురు… ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాక్‌!

ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. భారతదేశంలో పెళ్లంటే మామూలుగా ఉండదు. ఈ పెళ్లిసందడి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నా పెళ్లిలో డాన్స్‌ చేయడం మాత్రం కామన్‌. సాధారణంగా పెళ్లిలో వధూవరులను ఓ ప్రత్యేక వాహనంలో ఊరేగిస్తూ దానిముందు బంధుమిత్రులు ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తారు...

Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్‌ చూసి చెప్పుతీసిన పెళ్లికూతురు... ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాక్‌!
Bride Took Out Slippers Aft

Updated on: Aug 21, 2025 | 6:25 PM

భారతదేశంలో పెళ్లంటే మామూలుగా ఉండదు. ఈ పెళ్లిసందడి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నా పెళ్లిలో డాన్స్‌ చేయడం మాత్రం కామన్‌. సాధారణంగా పెళ్లిలో వధూవరులను ఓ ప్రత్యేక వాహనంలో ఊరేగిస్తూ దానిముందు బంధుమిత్రులు ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తారు. ప్రస్తుత కాలంలో బంధుమిత్రులే కాదు వధూవరులు కూడా వారితో కలిసి కాలు కదుపుతున్నారు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో పెళ్లి ఊరేగింపులో పెళ్లికొడుకే డాన్స్‌ చేయడం ప్రారంభించాడు. అలా డాన్స్‌ చేస్తూ ఊగిపోతున్న పెళ్లికొడుకును చూసి పెళ్లికూతురు చెప్పుతీసింది. ఆ తర్వాతే ఉంది అసలైన ట్విస్ట్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఇక్కడ బంధుమిత్రులకు బదులు వరుడే డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టాడు. అలా డ్యాన్స్‌ చేస్తూ వధువు వద్దకు వెళ్లాడు. డాన్స్‌చేస్తూ ఊగిపోతున్న పెళ్లికొడుకును చూసి వధువు తన కాలి చెప్పు తీసింది. అదిచూసి అక్కడున్నవారంతా షాకయ్యారు. ఎక్కడ పెళ్లికొడుకును చెప్పుతో కొట్టేస్తుందోనని ఆందోళన చెందారు. కానీ ఊహించని విధంగా పెళ్లికుమార్తె కూడా చెప్పులు తీసేసి మరీ డ్యాన్స్‌ చేస్తూ రెచ్చిపోయింది. వరుడితో పోటాపోటీగా డ్యాన్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వీడియో చూడండి:

 

వధూవరులు పోటాపోటీగా చేసిన డ్యాన్స్‌ను పెళ్లికొచ్చినవారు తమ మొబైల్స్‌లో బంధించారు. దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను పాతికవేల మందికి పైగా వీక్షించారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు.