Viral Video: ఈ మహిళ గర్భంలో 18 మంది పిల్లలు.. వీడియో చూసిన తర్వాత అసలు నిజం వెలుగులోకి..

|

Sep 19, 2024 | 9:45 AM

ఆ మహిళ కడుపు బెలూన్ లాగా ఉబ్బిపోయి 18 మంది పిల్లలకు జన్మనిస్తుంది అన్నట్లుగా వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ప్రకారం ఈ మహిళ అమెరికాలోని టెక్సాస్ నివాసి. వీడియోలో గర్భం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని చెప్పారు. అంతేకాదు ఈ వీడియోలో ఒకరు భయంకరమైన నిజాన్ని చెప్పారు. ఆమె గర్భవతి కాదని ఆమెకు భారీ కణితి ఉందని ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు.

Viral Video: ఈ మహిళ గర్భంలో 18 మంది పిల్లలు..  వీడియో చూసిన తర్వాత అసలు నిజం వెలుగులోకి..
Viral News
Image Credit source: Instagram
Follow us on

తల్లి అవ్వడం అనేది ఏ స్త్రీకైనా చాలా ఆహ్లాదకరమైన అనుభూతి. ప్రతి స్త్రీ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ తన ఒడిలో ఆడుకోవాలని .. పసిపాప బోసి నవ్వు వినాలని కోరుకుంటుంది. అయితే ఈ కోరిక ప్రతి స్త్రీకి నెరవేరదు. పిల్లల కోసం చాలా మంది మహిళలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. ఓ వైపు దేవుడిని పుజిస్తూనే .. సైన్స్ ను నమ్మకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది స్త్రీల కల నెరవేరదు. అటువంటి స్త్రీలు ఆసుపత్రికి వెళ్లి తగిన చికిత్స తీసుకుని తద్వారా తల్లి కావాలనే తమ కోరికను నేర్చుకోవాలని భావిస్తారు. అలా ఏదోక రూపంలో తాము తల్లి కావాలనే కోరికను నెరవేర్చుకుంటారు. గర్భవతిగా ఉన్న సమయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు కూడా.. అయితే కొంత మంది మహిళల గర్భం విషయంలో కలలో కూడా ఊహించని విధంగా సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి కథే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ స్త్రీ 18 మంది పిల్లలకు జన్మనివ్వబోతోందని ప్రచారం జరుగుతోంది.. అయితే అక్కడ ఉన్న నిజం మరొకటి.

ఆ మహిళ కడుపు బెలూన్ లాగా ఉబ్బిపోయి 18 మంది పిల్లలకు జన్మనిస్తుంది అన్నట్లుగా వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ప్రకారం ఈ మహిళ అమెరికాలోని టెక్సాస్ నివాసి. వీడియోలో గర్భం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని చెప్పారు. అంతేకాదు ఈ వీడియోలో ఒకరు భయంకరమైన నిజాన్ని చెప్పారు. ఆమె గర్భవతి కాదని ఆమెకు భారీ కణితి ఉందని ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఈ వీడియోను విడుదల చేసిన కొద్దిసేపటికే మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ మహిళకు సంబంధించిన మరొక వీడియోలో కూడా ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి తన పరిస్థితిని వివరిస్తున్నాడు, ఈ వీడియో విడుదలైన కొద్దిసేపటికే మహిళ మరణించిందని చెప్పబడింది. అయితే ఈ వీడియో, కణితిని నిజమని tv9 తెలుగు ఎక్కడా ధృవీకరించలేదు.

ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు., రకరకాలుగా వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఒకరు ఇలా వ్రాశారు, ‘మహిళ చాలా కష్టంతో శ్వాస తీసుకోగలుగుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియోలో ఉన్నది ఎంత నిజం ఉందనేది మిస్టరీగా ఉన్నప్పటికి.. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు, తప్పుడు సమాచారం వలన సంభవించే ప్రమాదాల గురించి అవగాహన పెంచుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..