Viral Video: వామ్మో.. అందితే గొంతు నమిలేసేది..! పాఠశాల కెమెరాలో రికార్డయిన షాకింగ్‌ ఘటన

ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డును కుక్క కరిచిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో జరిగిన...

Viral Video: వామ్మో.. అందితే గొంతు నమిలేసేది..! పాఠశాల కెమెరాలో రికార్డయిన షాకింగ్‌ ఘటన
Stree Dog Attack On Securit

Updated on: Dec 15, 2025 | 4:44 PM

ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డును కుక్క కరిచిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో జరిగిన ఈ సంఘటన రికార్డ్‌ కావడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ముంబైలోని గోరేగావ్‌లో వీధి కుక్క పాఠశాల సెక్యూరిటీ గార్డు మీదికి దూకి భుజాన్ని కరిచింది. కలవరపరిచే ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. గురువారం, డిసెంబర్ 11న ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో జరిగినట్లుగా వైరల్‌ వీడియో ద్వారా తెలుస్తోంది.

ఈ సంఘటన గోరేగావ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లోని ఆదర్శ విద్యాలయ పాఠశాలలో ఉదయం 9.40 గంటల ప్రాంతంలో జరిగిందని సమాచారం. కెమెరాలో రికార్డయిన ఈ సంఘటనలో, వీధి కుక్క అకస్మాత్తుగా దూకి పాఠశాల సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అతని భుజాన్ని కరవడం కనిపిస్తుంది. కుక్క కరిచిన సంఘటన తర్వాత మరో సెక్యూరిటీ గార్డు ఆ వీధి కుక్కపై దాడి చేయడం కూడా వీడియోలో కనిపించింది.

వైరల్‌ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మున్సిపాల్టీ అధికారులపై మండిపడుతున్నారు. వీధి కుక్కల బెడదపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి: