Viral Video: ఇంకా నయం…జేబులో బ్లాస్ట్‌ అయిన సెల్‌ఫోన్‌… దెబ్బకు తూట్లుపడ్డ డెనిమ్‌ జీన్స్‌ పాయింట్‌

సెల్‌ఫోన్‌ పేలుళ్లకు సంబంధించిన ఘటనలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతుంటాయి. సాధారణంగా సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టినప్పుడో లేదా అధిక ఉష్ణోగ్రత వల్లనో పేలిపోతుంటాయి. చాలా వరకు ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ పేలిన ఘటనలు అధికంగా నమోదవుతుంటాయి. అలాంటి...

Viral Video: ఇంకా నయం...జేబులో బ్లాస్ట్‌ అయిన సెల్‌ఫోన్‌... దెబ్బకు తూట్లుపడ్డ డెనిమ్‌ జీన్స్‌ పాయింట్‌
Smpart Phone Blast In Pocke

Updated on: Jan 08, 2026 | 5:23 PM

సెల్‌ఫోన్‌ పేలుళ్లకు సంబంధించిన ఘటనలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతుంటాయి. సాధారణంగా సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టినప్పుడో లేదా అధిక ఉష్ణోగ్రత వల్లనో పేలిపోతుంటాయి. చాలా వరకు ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ పేలిన ఘటనలు అధికంగా నమోదవుతుంటాయి. అలాంటి సంఘటనలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటాయి. టెక్‌ నిపుణులు కూడా పలు సూచనలు ఇస్తుంటారు. కానీ ఇక్కడ అనూహ్యంగా ఓ సెల్‌ ఫోన్‌ పేలిపోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీలో ఒక వినియోగదారుడి జేబులో మోటరోలా మోటో G54 5G పేలిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల అతని జీన్స్‌లో కాలిపోయిన రంధ్రం ఏర్పడింది. స్మార్ట్‌ఫోన్ పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ఆ పరికరం ఉపయోగంలో లేదు. ఛార్జింగ్‌లో కూడా లేదని నివేదించబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ సంఘటన వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై మోటరోలా ఇంకా స్పందించలేదు.

ఈ వీడియోను “shubhxr_369” అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో అతని డెనిమ్ జీన్స్‌ కాలిపోయి పెద్ద రంధ్రం ఏర్పడటం కనిపిస్తుంది. సెల్‌ఫోన్‌ కాలిపోయి కరిగిపోయిన దృశ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా, పేలుడు జరిగిన సమయంలో ఫోన్ ఉపయోగంలో లేదు. ఛార్జింగ్‌లో కూడా లేదని వినియోగదారుడు పేర్కొన్నాడు.

వీడియోలో ఆ వినియోగదారుడు కంపెనీపై చట్టపరమైన ఫిర్యాదు చేయాలనే తన ఉద్దేశాన్ని కూడా పేర్కొన్నాడు. ఈ విషయంపై కంపెనీ ఇంకా స్పందించలేదు. గిజ్మోచైనా నివేదికలో ఆ పరికరం మోటో G54 5G అయి ఉండవచ్చని పేర్కొంది.

వీడియో చూడండి: