AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరిగే నూనెలో పకోడీలు, అదే కడాయిలో టీ తయారీ.. వీధి వ్యాపారి విచిత్ర ప్రయోగం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుత ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. ఆ నెట్టింట ఎలాంటి విచిత్రాలు ఎప్పుడు వైరల్ అవుతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా వీధి వ్యాపారులు చేసే ప్రయోగాలు, వంటకాల కాంబినేషన్లు తరచూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఒక రోడ్‌సైడ్ వ్యాపారి చేసిన వింత ప్రయోగం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. వైరల్‌ వీడియోలో ఏముందంటే..

మరిగే నూనెలో పకోడీలు, అదే కడాయిలో టీ తయారీ.. వీధి వ్యాపారి విచిత్ర ప్రయోగం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Tea Making Hack
Jyothi Gadda
|

Updated on: Jul 21, 2026 | 4:59 PM

Share

సామాజిక మాధ్యమాల ప్రపంచంలో ఎలాంటి విచిత్రాలు ఎప్పుడు వైరల్ అవుతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా వీధి వ్యాపారులు చేసే ప్రయోగాలు, వంటకాల కాంబినేషన్లు తరచూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఒక రోడ్‌సైడ్ వ్యాపారి చేసిన వింత ప్రయోగం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. వైరల్‌ వీడియోలో ఏముందంటే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక వీది వ్యాపారి ఒక పెద్ద కడాయిలో నూనెను బాగా కాచి పకోడీలు వేయిస్తున్నాడు. అయితే విచిత్రం ఏమిటంటే, అదే నూనె కాగుతున్న పాత్ర మధ్యలో ఒక చిన్న పాత్రను ఉంచి అందులో పాలు, టీ పొడి వేసి టీ కాచడం ప్రారంభించాడు. నూనె వేడి సహాయంతోనే ఆ పాత్రలోని టీ కూడా వేడెక్కి మరుగుతుంది. ఒకే స్టవ్, ఒకే బాణలి ఉపయోగించి ఒకే సమయంలో పకోడీలు, టీ రెండింటినీ తయారు చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇంటర్నెట్‌లో షేర్ అయినప్పటి నుండి నెటిజన్ల నుంచి విభిన్న రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు దీనిని ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని అభివర్ణించారు. సమయం, గ్యాస్ ఆదా చేయడానికి ఇది ఒక అద్భుతమైన దేశీ జుగాడ్ అని, అసలైన మల్టీటాస్కింగ్ అంటే ఇదేనని కామెంట్లు చేశారు. ఇలాంటి వింత టాలెంట్ కేవలం మన దేశంలోనే చూడగలం అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు.

వీడియో ఇక్కడ చూడండి..

అయితే మెజారిటీ నెటిజన్లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరిగే నూనె చుక్కలు టీ పాత్రలో పడే ప్రమాదం ఉందని, దానివల్ల ఆహార పరిశుభ్రత పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార వ్యయాన్ని తగ్గించుకోవడానికి, త్వరగా ఆర్డర్లు పూర్తి చేయడానికి వ్యాపారులు ఇలాంటి వింత మార్గాలను ఎంచుకుంటున్నప్పటికీ, ఆహార భద్రత విషయంలో ఇలాంటి ప్రయోగాలు ఏమాత్రం తగవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన పకోడీ-ఛాయ్ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!