Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో అనుమానాస్పద జంతువు.. చిరుత..?

|

Jun 10, 2024 | 3:23 PM

మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతి భవన్‌లో వన్యప్రాణి సంచరిస్తోండటం కనిపించింది. దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేస్తోన్నప్పుడు, రిజిస్టర్‌లో సంతకం చేస్తోన్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ కారిడార్‌లో ఈ జంతువు తిరుగాడటం వీడియోల్లో రికార్డయింది.

Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో అనుమానాస్పద జంతువు.. చిరుత..?
Rashtrapati Bhavan
Follow us on

రాష్ట్రపతి భవన్‌లో అనుమానాస్పద జంతువు సంచారం సంచలనంగా మారింది. జూన్ 9, ఆదివారం కేంద్రమంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనుకవైపు ఓ జంతువు అటు వైపు వెళ్తూ కనిపించింది. అది చిరుతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిరుతలు రాష్ట్రపతి భవన్‌లో పెంచుతారా అన్న సందేహాలు తెర మీదకొస్తున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో ఎవరో దీన్ని పెంచుకుంటోన్నారంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు కొందరు నెటిజన్లు. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కేంద్రమంత్రిగా దుర్గా దాస్‌ ప్రమాణం చేసిన అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేస్తుండగా బ్యాగ్రౌండ్‌లో రాష్ట్రపతి భవన్ మెట్ల పైన ఓ జంతువు అటుగా వెళ్తున్నట్టు క్లియర్‌గా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వాళ్లంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో చిరుతలను పెంచుతారా? ఆ అవకాశం ఉందా అని రకరకాల సందేహాలను లేవనెత్తుతున్నారు. ఇంతకీ వీడియోలో కనిపించింది చిరుతేనా? లేదంటే ఒక రకమైన శునకమా? లేదా ఏదైనా జాతికి చెందిన పిల్లా..?  ఇలా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇలా వచ్చి అలా వెళ్లిన జంతువు.. అందరికీ పరీక్ష పెట్టింది.

 

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..