Viral Video: ముసల్దానికి పెట్టకుండా ఒక్కడివే తింటవా… మాడమీది నుంచి చరిసిన కుక్క

సోషల్‌ మీడియాలో ఓ ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, దానిని ప్రశంసిస్తున్నారు. వీడియోలో ఒక పెంపుడు కుక్క ఓ యువకిడి నెత్తి మీద కొడుతుంది. ఆకలితో ఉన్న తన వృద్ధ యజమాని పట్ల...

Viral Video: ముసల్దానికి పెట్టకుండా ఒక్కడివే తింటవా... మాడమీది నుంచి చరిసిన కుక్క
Dog Attack Man

Updated on: Jul 24, 2025 | 11:39 AM

సోషల్‌ మీడియాలో ఓ ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, దానిని ప్రశంసిస్తున్నారు. వీడియోలో ఒక పెంపుడు కుక్క ఓ యువకిడి నెత్తి మీద కొడుతుంది. ఆకలితో ఉన్న తన వృద్ధ యజమాని పట్ల ఆమె కోడుకు చేసిన నిర్వాకంతో ఆ కుక్కకు చిర్రెత్తుకొచ్చింది. కుక్కలు విశ్వాసానికి మారుపేరు అంటారు. ఆకలితో ఉన్న కుక్కకు ఇంత తిండి పెడితే చచ్చే వరకు అది విశ్వాసాన్ని చూపెడుతుంటుంది. అంతేకు కుక్కలు మనిషులకు అత్యంత నమ్మకమైన స్నేహితులు. అవి తమ యజమానుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడమే కాకుండా, వారికి ఏదైనా అన్యాయం జరిగిన వెంటనే స్పందిస్తుంటాయి. ఈ వైరల్ వీడియో కూడా అలాంటిదే. ఇది కోట్లాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

వైరల్ వీడియోలో, ఒక వృద్ధురాలు తన పెంపుడు జంతువు గోల్డెన్ రిట్రీవర్‌తో సోఫాలో కూర్చుని కనిపిస్తుంది. ఆ మహిళ కుమారుడు కూడా వారితో ఉన్నాడు. అతని చేతిలో ఆహారంతో నిండిన గిన్నె ఉంది. వీడియోలో ఆ వ్యక్తి గిన్నె నుండి ఒక చెంచా ఆహారాన్ని తీసుకొని మొదట కుక్కకు అందించడం మీరు చూస్తారు. కానీ కుక్క దానిని వృద్ధ మహిళ వైపు తిప్పి, ముందుగా ఆమెకు ఆహారం ఇవ్వమని చెబుతున్నట్లుగా సైగ చేస్తుంది.

అయితే అదే సమయంలో ఆ వ్యక్తి ఓ చిలిపి పని చేస్తాడు. అతను ఆ వృద్దురాలి నోటి వద్దకు చెంచా తీసుకొని దానిని తీసివేసి, ఆపై ఆహారాన్ని తానే తింటాడు. దీన్ని చూసిన పెంపుడు కుక్క కోపంగా ఉంటుంది. ఆపై మీరు ఊహించలేనంత దారుణంగా ఆ వ్యక్తిని కొడుతుంది. ఎంతో సరదాగా సాగే ఈ వీడియో సోషల్‌ మీడియా యూజర్లను ఆకట్టుకుంటుంది.

వీడియో చూడండి:

 

వీడియో చూసిన నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. కుక్కలు ఇలాగే ఉంటాయని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించారు. వాటి యజమానులకు జరిగే అన్యాయాన్ని అవి ఎప్పుడూ సహించవని మరొకరు కామెంట్స్‌ పెట్టారు. ఈ కుక్క ఎంత ముద్దుగా ఉందో అన్నారు మరొకరు. జంతువులకు ‘మానవత్వం’ ఎక్కువ అంటూ మరో నెటిజన్‌ పోస్టు పెట్టారు.