
గాషారం బాగా లేకుంటే తాడే పామై కరుస్తుందంటారు. కానీ, అదృష్టం ఉంటే మాత్రం పాము కూడా తాడుగా మారుతుంది. కొంతమంది ఒక్కోసారి రవ్వంలో ప్రాణాపాయం నుంచి రవ్వంతలో తప్పించుకుంటూ ఉంటారు. ఆ సంఘటనలు చూసిన తర్వాత తప్పించుకున్నారు అనే బదులు తప్పిపోయింది అంటేనే కరెక్ట్‌గా సూటవుతుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియలో త్వరగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో కొన్ని వాహనాలు వెళుతుండటం చూడొచ్చు. ఆ పక్కనే లోయలో నది ప్రవహిస్తుండటం కనిపిస్తుంది. ఎత్తైన ఆ ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. ఘాట్‌రోడ్డు అనగానే ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో జరిగిన సంఘటన మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. కొండ పై నుంచి ఒక పెద్ద బండరాయి గాల్లో ఎగురుకుంటూ కార్లవైపు దూసుకొచ్చింది. ఈ సమయంలో జరిగిన అద్భుతమే అదృష్టంగా భావించొచ్చు. ఆ బండరాయి కారు ముందు బానెట్ మీదుగా ఒరుసుకుంటూ అవుతలి వైపు అంతే స్పీడ్‌గా దుసుకెళ్లింది. ఆ బండరాయి కొంచెం తగిలినందుకే కారు బానెట్ డ్యామేజ్ అయింది. ఒకవేళ ఆ రాయి కారు మీద పడి ఉంటే కారుతో పాటు అందులోని ప్రయాణికులు ఏమైపోయేవారో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.
Even after the monsoon, roads still aren’t fully safe! This could have been fatal, but by God’s grace only the front portion of the car was damaged. These boulders can crush cars like paper within seconds!
📍 Nathpa Point, Kinnaur pic.twitter.com/gJ4akGEeSU
— Nikhil saini (@iNikhilsaini) October 8, 2025
కిన్నౌర్‌లోని నాథ్పా పాయింట్ వద్ద జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డు అయ్యాయి. దీంతో ఆ సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని వేల మంది ఈ వీడియోను వీక్షించి కామెంట్స్ పెడుతున్నారు. వర్షా కాలంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు.