Viral Video: పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి(Summer Season) వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది మామిడి పండు. ప్రతి వారి చూపు పండ్లలో రారాజు మామిడి పండు(Mango Fruit) వైపే ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఇక మార్కెట్లోకి మామిడి పండు వచ్చిందంటే చాలు అందరి చూపు అందరివైపే..మామిడి పండు రుచికి ఫిదా.. అందుకనే 4వేల వేళ్లకు పైగా ప్రసిద్ది చెందిన మామిడి ఫలాన్ని వేదాల్లో “దేవతల ఫలం” అని అంటారు. అయితే మామిడి పండులో టెంకె సర్వసాధారణంగా ఉంటుంది.. కానీ టెంక లేని మామిడి పండు ఉంటుందని ఊహించారా.. అలాంటి మామిడి పండ్లు ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతుంది.
మామిడి పండ్లు గ్లోబల్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న దేశం థాయిలాండ్. ఈ దేశం ఎగుమతి చేసే పండ్లలో ఒకటి మామిడి పండ్లు. ఈ వీడియోలో ఒక అమ్మాయి మామిడి పండ్ల బుట్టల్లో పెట్టి రెడీ చేస్తోంది. అయితే ఒక బుట్టలో నుంచి ఒక మామిడి పండును తీసుకుని దానిని మధ్యలోకి కట్ చేసింది. అందులో టెంక లేదు.. కానీ చూడగానే తినాలని అనిపించేలా ఉంది. అయితే ఇటువంటి టెంక లేని మామిడిలోని కొత్త రకాన్ని మనదేశంలోని శాస్త్రవేత్తలు కూడా అభివృద్ధి చేశారు. 2014లో భాగల్పూర్ జిల్లాలోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(బీఏయూ) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
అయితే ఇలా అభివృద్ధి పేరుతో ప్రకృతికి విరుద్ధంగా పండించడం వల్ల నష్టమే కానీ లాభం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. “టెంక లేని మామిడి పండు అంటే మెదడు లేని శరీరం” అని కొందరు. టెంక లేదు, పోషకాలు లేవు,ఆరోగ్యం లేదని మరికొందరు కామెంట్ చేస్తుంటే.. ఇంకొందరు.. మామిడి పండు తినడం కంటే టెంక తింటుంటే వచ్చే మజా వేరని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోదరు చూడడానికి ఒకే.. తింటే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. మరి మీరు కూడా టెంక లేని మామిడి పండుపై ఓ లుక్ వేయండి మరి
టెంక లేని మామిడి పండ్లు?? pic.twitter.com/gxPsLShRmY
— ??????? (@Kishoredelights) March 29, 2022
Also Read: