మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా.. అభిమానులను మాత్రం విడిచిపెట్టలేదు. తనకు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోలతో పాటు తనకు నచ్చిన మెచ్చిన వీడియోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ తో ఎప్పుడూ సచిన్ టచ్‌లోనే ఉంటారు. తాజాగా థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న సచిన్ కయాకింగ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సచిన్. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో కోచ్ మాస్టర్ బ్లాస్టర్‌కు కయాకింగ్ మెలకువలు వివరిస్తున్నారు. కయాకింగ్ తెడ్డును ముందుకూ, వెనక్కీ కదిలించడం ఎలాగో అతను సచిన్‌కు నేర్పించారు. ఆ తర్వాత సచిన్ సాగర తీరంలో కయాకింగ్ చేస్తూ సందడిగా గడిపారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.
కయాకింగ్ నేర్చుకుంటున్న లిటిల్ మాస్టర్
సచిన్ కయాకింగ్ వీడియోపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆసక్తికరంగా స్పందించారు. ‘సచిన్.. నిన్ను ఇంతకు ముందే ఫూలయ్ బే దగ్గర చూశాను. అక్కడే ఉన్నావా?’ అంటూ కామెంట్ చేశారు.. ‘క్రికెట్ దేవుడు తన కలల్లో జీవిస్తున్నాడు’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. కయాకింగ్ కోచ్‌ను ఉద్ధేశిస్తూ.. ‘సోదరా! నువ్వు ఎవరికి కయాకింగ్ నేర్పిస్తున్నావో తెలుసా.. క్రికెడ్ దేవుడికి’ అంటూ మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..