Viral Video: విమానంలో తలైవా… ఫ్యాన్స్ కోసం లేచి నిలబడి మరీ… కామన్‌ మ్యాన్‌లా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం వీడియో వైరల్‌

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది. స్టార్ హీరో అయినప్పటికీ అభిమానులతో సరదాగా కలిసిపోతుంటారు. తాజాగా... ఆయన కామన్ మ్యాన్‌లా విమానంలో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది...

Viral Video: విమానంలో తలైవా... ఫ్యాన్స్ కోసం లేచి నిలబడి మరీ... కామన్‌ మ్యాన్‌లా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం వీడియో వైరల్‌
Rajanikanth Flight Fans

Updated on: Aug 07, 2025 | 7:16 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది. స్టార్ హీరో అయినప్పటికీ అభిమానులతో సరదాగా కలిసిపోతుంటారు. తాజాగా… ఆయన కామన్ మ్యాన్‌లా విమానంలో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది.

తాజాగా… రజినీకాంత్ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. ఆయన్ను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. వెనుక నుంచి ఓ ఫ్యాన్… ‘తలైవా మీ ఫేస్ చూడాలని ఉంది.’ అంటూ రిక్వెస్ట్ చేయగా… రజినీ లేచి నిలబడి అందరికీ అభివాదం చేశారు. దీంతో అందరూ హుషారుగా కేకలు వేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా… ఆయన సింప్లిసిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వీడియో చూడండి:

సూపర్ స్టార్ రజినీకాంత్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫ్లైట్‌లో సామాన్యుడిలా ఎకానమీలో ప్రయాణిస్తూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు లేచి నిలబడి అభివాదం చేయడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రజినీ తలుచుకుంటే ఓ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లొచ్చని… కానీ బిజినెస్ క్లాస్‌లో కూడా కాకుండా ఎకానమీ క్లాస్‌లోనే సామాన్యుడిలా జర్నీ చేయడం ఆయనకే సాధ్యమైందంటూ కొనియాడుతున్నారు.