Viral Video: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!

|

Jan 13, 2025 | 11:06 AM

ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఫుడ్ కంటే ఇంటి భోజనమే ఉత్తమం అని చాలామంది అంటారు. నాసిరకమైన ఫుడ్‌తో బయట హోటల్స్‌లో తినాలంటేనే జంకుతున్నారు జనాలు. సరిగ్గా ఇలాంటి తరహ ఘటన ఒకటి జైపూర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Viral Video: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!
Viral
Follow us on

ఇంట్లో ఎన్ని రకాల ఫుడ్స్ చేసినా.. వారంలో రెండు లేదా మూడు రోజులైనా సరే బయట ఏదొక చిరుతిళ్లు తినాలనుకుంటారు కొందరు. కమ్మగా లొట్టలేసుకుని తింటుంటారు. సరిగ్గా ఇలాగే చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. కమ్మటి సమోసా ఆవురావురుమని తినేందుకు ఓ హోటల్‌కి వెళ్లాడు. సమోసా కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాడు. ఆత్రంగా చిన్న ముక్క ఇలా కొరికాడో.. లేదో.. కూరతో పాటు ఓ షేవింగ్ బ్లేడు కనిపించింది. దీంతో ఆ వ్యక్తి దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. టోంక్ జిల్లా నివాయ్‌టౌన్‌కు చెందిన రమేష్ వర్మ హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఉద్యోగం కోసం తరచూ బయట తిరిగే అతడు.. అప్పుడప్పుడూ బయట చిరుతిళ్లు తింటూ ఉంటాడు. ఎప్పటిలాగే కమ్మటి సమోసాలు తినేందుకు ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ కచోరి, మిర్చి బజ్జీలతో పాటు సమోసాలను కొనుగోలు చేశాడు. అనంతరం ఆ పార్శిల్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి చేరుకొని.. ఆవురావురుమంటూ ఆ సమోసాలను తినాలనుకున్నాడు. ఆత్రంగా ఓ ముక్క కొరికాడు. అందులో కూరతో పాటు ఏదో మెరుస్తూ కనిపించింది. అదేంటని చూడగా.. ఓ షేవింగ్ బ్లేడు కనిపించింది. దానికి సంబంధించి వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. అలాగే ఈ అంశంపై సదరు హోటల్‌కి వెళ్లి నిర్వాహకులను ప్రశ్నించగా.. వారు దురుసుగా ప్రవర్తించారు. దీంతో సదరు వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు అక్కడ పదార్ధాల నమూనాలను సేకరించారు. పరిశీలించిన అనంతరం ఏదైనా ఇతర పదార్ధాలు కలిసినట్టు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇది చదవండి: ప్రధాని మోదీ యూట్యూబ్ సంపాదన ఎంతో తెల్సా.. ఎన్ని కోట్లంటే.?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి