Viral Video: నేనూ మాంచి ఫోటోగ్రాఫర్‌నే.. కెమెరాతో చిలుక ఏం చేసిందో చూస్తే మతిపోవాల్సిందే!

Viral Video: ఓ కొంటె చిలుక టూరిస్ట్‌కు గోప్రో కెమెరాను దొంగిలించింది. అంతేకాదు.. అలా దొంగిలించిన కెమెరాతో నేషనల్ పార్క్ మొత్తం అందాలను...

Viral Video: నేనూ మాంచి ఫోటోగ్రాఫర్‌నే.. కెమెరాతో చిలుక ఏం చేసిందో చూస్తే మతిపోవాల్సిందే!
Viral News

Updated on: Mar 03, 2022 | 9:01 AM

Viral Video: ఓ కొంటె చిలుక టూరిస్ట్‌కు గోప్రో కెమెరాను దొంగిలించింది. అంతేకాదు.. అలా దొంగిలించిన కెమెరాతో నేషనల్ పార్క్ మొత్తం అందాలను వీడియో షూట్ చేసింది. న్యూజిలాండ్‌లోని ఫియోర్డ్‌ల్యాండ్ నేషనల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కుటుంబం న్యూజిలాండ్‌లోని ఫియోర్డ్‌‌ల్యాండ్ నేషనల్ పార్క్‌ పక్షులు, జంతువులను చూసేందుకు విహారయాత్రకు వెళ్లింది. తమ వెంట గోప్రో కెమెరాను కూడా తీసుకెళ్లారు. పక్షులను షూట్ చేస్తూ.. కెమెరాను ఒక గోడపై పెట్టారు. ఇంతలో పక్కనే ఉన్న ఓ చిలుక అకస్మాత్తుగా కెమెరా వైపు తిరిగింది. చకచకా నడుచుకుంటూ వచ్చి.. ఆ గోప్రో కెమెరాను నోటితో పట్టుకుని ఎత్తుకెళ్లింది. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించిన చిలుక.. ఓ చెట్టు మీద కూర్చింది. కెమెరాను తినే పదార్థం అనుకుందో ఏమో గానీ.. దానిని ముక్కుతో పొడుస్తూ తినేందుకు ప్రయత్నించింది. అయితే, చిలుక కెమెరాను ఎత్తుకెళ్తున్న సమయంలో కెమెరా ఆన్‌లో ఉండటంతో.. నేషన్ పార్క్ అందాలన్నీ రికార్డ్ అయ్యాయి. చిలుక ఎగిరినంత సేపు.. కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి.

ఆ కాసేపటికే గోప్రో కెమెరాను ఎత్తుకెళ్లిన చిలుకను వెతుక్కుంటూ సదరు టూరిస్టు ఫ్యామిటీ వెళ్లింది. ఓ చెట్టుపై కెమెరాతో ఉన్న చిలుకను గమనించారు. వెంటనే దాని వద్దకు వెళ్లగా.. అది ఆకెమెరాను వదిలి తుర్రుమని ఎగిరిపోయింది. కాగా, కెమెరాలో అందమైన దృశ్యాలు రికార్డవ్వడంతో.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్ల మది దోచేస్తుంది. అందమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి.


Also read:

News Watch: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు 15 కోట్ల డీల్ మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్.. వీడియో

Mega-Yacht Seize: ఉక్రెయిన్ లో రెచ్చిపోతున్న రష్యాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జర్మనీ.. పూర్తి వివరాలు

Lahari Shari: అప్పుడు లగ్జరీ బైక్‌.. ఇప్పుడేమో ఖరీదైన కారు.. లహరి స్పీడు మాములుగా లేదుగా.. కొత్త కారు ధరెంతో తెలుసా?