Viral Video: బిక్షాటన చేసి కోటీశ్వరురాలైన పాకిస్తానీ అమ్మాయి.. మలేషియాలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది

|

Nov 26, 2023 | 9:59 AM

కొంచెం అప్రమత్తంగా ఉంటే ఆపన్నులు, అవకాశవాదులు మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించగలరు. ఇది ప్రస్తుత కాలంలో చాలా అవసరం. మీకు నమ్మకం లేకుంటే వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఇందులో ఒక అమ్మాయి తాను ప్రజలను ఎలా మోసం చేస్తుందో.. వారి నుండి ఎలా అడుక్కుంటుందో చెప్పింది. రోజూ తాను చేస్తున్న భిక్షాటన ద్వారా వచ్చిన సంపాదన ఆధారంగా ఆ మహిళ ఏకంగా కోట్లు కూడబెట్టింది.

Viral Video: బిక్షాటన చేసి కోటీశ్వరురాలైన పాకిస్తానీ అమ్మాయి.. మలేషియాలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది
Viral Video
Follow us on

సాధారణంగా బిచ్చగాడి గురించి ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది. అత్యంత పేదవాడు.. జీవనోపాధి కోసం ఏమీ చేయలేక బిక్షాటన చేసే వ్యక్తి. ఆలయాల దగ్గర, రోడ్ల పక్కన ఇలా పలు ప్రాంతాల్లో చాలా మంది బిచ్చగాళ్లను చూస్తుంటారు. పేదవారు, నిరుపేదలుగా పరిగణించి కొంత డబ్బు ఇస్తారు ఎందుకంటే ఎవరికైనా సహాయం చేయడం గొప్ప పని. అయితే ఇలాంటి బిచ్చగాళ్లలో కొందరు తమ దుస్థితిని చూపించి ఎదుటివారి భావోద్వేగాలతో ఆడుకుంటారు. తప్పుడు కథలు చెప్పి ఆదుకోమంటూ అవతలి వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుంటారు.

కొంచెం అప్రమత్తంగా ఉంటే ఆపన్నులు, అవకాశవాదులు మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించగలరు. ఇది ప్రస్తుత కాలంలో చాలా అవసరం. మీకు నమ్మకం లేకుంటే వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఇందులో ఒక అమ్మాయి తాను ప్రజలను ఎలా మోసం చేస్తుందో.. వారి నుండి ఎలా అడుక్కుంటుందో చెప్పింది. రోజూ తాను చేస్తున్న భిక్షాటన ద్వారా వచ్చిన సంపాదన ఆధారంగా ఆ మహిళ ఏకంగా కోట్లు కూడబెట్టింది. మలేషియాలో రెండు ఫ్లాట్లు, ఒక కారు కొన్నది. అంతేకాదు ఆ బిచ్చగత్తెకు సొంత వ్యాపారం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ తన పేరును లైబా అని చెప్పడాన్ని మీరు చూడవచ్చు. ఈ 1 నిమిషం 25 సెకన్ల వీడియోలో గత ఐదేళ్లలో భిక్షాటన చేసి చాలా డబ్బు సంపాదించినట్లు యువతి చెబుతోంది. తాను రోజూ భిక్షాటన చేసి ధనవంతురాలిగా మారినట్లు ఆ బాలిక స్వయంగా అంగీకరించింది. ఇంతకీ అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నావని ప్రశ్నించగా.. నిజం దాచలేనని చెప్పింది. మీకు ప్రజలు భిక్ష ఎలా ఇస్తారని ప్రశ్నించగా.. తప్పుడు కథలు చెప్పి డబ్బులు అడిగేదానిని అని.. అప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా డబ్బులు ఇచ్చేవారని చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో (@shahfaesal) అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోకు  ‘పొరుగు దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు’ అనే క్యాప్షన్ రాశాడు. వీడియో రాసే సమయానికి, 2.89 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను వీక్షించారు. భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక పాకిస్థానీ యూట్యూబర్ ఒక నెల క్రితం తన ఛానెల్‌లో ఈ ఒరిజినల్ వీడియోను షేర్ చేసి, ఈ మహిళను ఇంటర్వ్యూ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..