Viral Video: నరికేసిన చెట్టు మీద పడి బోరున విలపించిన వృద్దురాలు… ఎంత ప్రేమతో పెంచుకుందో పాపం..

ప్రకృతితో మనిషికి ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రకృతి పచ్చగుంటేనే ప్రాణి కోటి పదికాలాలు చల్లగ ఉంటుందంటారు. చెట్టు, పుట్ట, కొండ, కోన చుట్టూ మనుషుల జీవనం ముడిపడి ఉంటుంది. మనం రోడ్డు వెంట వెళుతున్నప్పుడు రోజూ కనపడే చెట్టు కొమ్మ కనపడకుంటేనే మనసు...

Viral Video: నరికేసిన చెట్టు మీద పడి బోరున విలపించిన వృద్దురాలు... ఎంత ప్రేమతో పెంచుకుందో పాపం..
Old Age Woman Weeped

Updated on: Oct 13, 2025 | 4:25 PM

ప్రకృతితో మనిషికి ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రకృతి పచ్చగుంటేనే ప్రాణి కోటి పదికాలాలు చల్లగ ఉంటుందంటారు. చెట్టు, పుట్ట, కొండ, కోన చుట్టూ మనుషుల జీవనం ముడిపడి ఉంటుంది. మనం రోడ్డు వెంట వెళుతున్నప్పుడు రోజూ కనపడే చెట్టు కొమ్మ కనపడకుంటేనే మనసు చివుక్కుమంటుంది. అలాంటి ఆ చెట్టే కూలిపోతే ఆ బాధ చెప్పలేనిది. మనుషులు, చెట్లకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ వైరల్‌ వీడియో నెటిజన్స్‌ను కన్నీరు పెట్టిస్తుంది.

ఓ వృద్ధురాలు నేల కొరిగిన రావి చెట్టు మొదలు దగ్గర నిలబడి బోరున విలపిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత దేశంలో రావిచెట్టును ఎంతో పవిత్రంగా చూస్తారు. పూజలు కూడా చేస్తారు. ఆంజనేయ స్వామి ఆలయాల్లో రావి చెట్టు కనపడటం చూస్తుంటాం. ఈ వైరల్‌ వీడియో ఛత్తీస్‌గఢ్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని సర్రగొండి గ్రామం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వృద్ధురాలు గత 20 ఏళ్లుగా ఓ రావి చెట్టును పెంచుతూ ఇంటిలో మనిషి వలె చూసుకుందట. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే ఆ వృద్దురాలు రావి చెట్టుకు రోజు పూజలు చేసేది. హఠాత్తుగా ఓ రోజు రావి చెట్టు నేలకొరికి కనిపిండంతో ఆ వృద్దురాలు తట్టుకోలేకపోయింది.

రావి చెట్టు ఉన్న స్థలంపై కన్నేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆ చెట్టును నరికేశాడు. ఈ సంఘటన వృద్ధురాలికి తెలియడంతో ఆమె పరుగున చెట్టు వద్దకు వెళ్లి చెట్టు మొదలుఉపై పడి బోరున విలపించింది. ఇంటిలో మనిషి చనిపోయినంతగా వెక్కి వెక్కి ఏడ్చింది. స్థానికులు ఓదార్చినా ఏడుపు ఆపుకోలేకపోయింది. చాలా సేపటి తర్వాత గానీ ఆమె కుదురుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెట్టును నరికేసిన ఇమ్రాన్, ప్రకాశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికీ కోర్టు జుడీషియల్ రిమాండ్‌ విధించింది.

వీడియో చూడండి:

కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వృద్దురాలి మీద సానుభూతి చూపిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.