
ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడంతోనే ఆమె నిజమైన ప్రయాణం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆమె మొత్తం జీవితం కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. తల్లి కావడం అంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, ప్రతి పరిస్థితిలోనూ ఆ బిడ్డ కోసం నిలబడటం. అది పొలం, గాదె, ఇల్లు, కార్యాలయం లేదా ఏదైనా ప్రదేశం అయినా తల్లి తన బాధ్యతల నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గదు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో కనిపించింది. ఇది లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. వీడియో కేవలం 32 సెకన్ల నిడివి ఉంది. కానీ దానిలో దాగి ఉన్న కథ మాత్రం చాలా పెద్దది.
ఈ వీడియోలో నీటితో నిండిన వరి పొలంలో ఒక మహిళ నాట్లు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె దగ్గర ఒక టబ్ ఉంది. దానిలో ఆమె చిన్న బిడ్డ పడుకుని ఉంది. శిశువు టబ్‌లో సురక్షితంగా మరియు సౌకర్యంగా ఉంటుంది. దగ్గరలో నిలబడి ఉన్న వ్యక్తి కొన్నిసార్లు టబ్‌ను కొద్దిగా కదిలిస్తాడు. శిశువు ఆడుకుంటూ, నవ్వుతూ ఉంటుంది. ఆ క్షణలను కెమెరాలో బంధించాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి టబ్‌ను స్వయంగా కదిలించి బిడ్డ వైపు చూస్తుంది. ఆ సమయంలో శిశువు అమాయక కళ్ళు నేరుగా కెమెరా వైపు ఉంటాయి.
She does not come into the feminist definition of “working women” but she is more strong and responsible than alleged “working women” and does not have excuse of NOT having a baby because she is alleged working women. pic.twitter.com/nhmzpr59DH
— Woke Eminent (@WokePandemic) September 7, 2025
వీడియో ఇక్కడ ముగుస్తుంది. కానీ వీక్షకుడి హృదయం మాత్రం ఆ వీడియోకే అతుక్కుపోతుంది. వరి పొలంలో వంగిన ఈ తల్లి కృషి పెద్దాగా చర్చకు రాకపోవచ్చు. కానీ ఆమె నిజమైన బలం, స్వావలంబన మాత్రం ఉట్టిపడుతుంది. ఆమె తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంది, వ్యవసాయ పనిని వదిలిపెట్టలేదు. ఇది జీవిత వాస్తవికత. ఇక్కడ తల్లికి ప్రతి పరిస్థితిని ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలుసు. ఈ చిన్న వీడియో స్త్రీలు ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో స్పష్టం చేసింది.
వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా యూజర్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తల్లి తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ, తన పరిస్థితులతో పోరాడుతూనే సమానంగా పనిచేస్తుందని ఒక వినియోగదారు రాశారు. అదే సమయంలో, మరొకరు ఒక తల్లి తన బిడ్డ యొక్క చిన్న చిరునవ్వు కోసం ప్రపంచం మొత్తంతో పోరాడగలదని, తల్లిగా ఉండటం అంటే ప్రేమ లేదా రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, లెక్కలేనన్ని త్యాగాలు, రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడం అని రాశారు.