స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతుల్లో దర్శనమిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ ఏ వింతలు, విశేషాలు కనిపించినా వెంటనే నెట్టింట్లో దర్శనం అవుతున్నయి. కొన్ని వీడియాలు చూస్తే ప్రపంచంలో జీవితం చాలా సులభమని.. అనిపిస్తుంది. కొన్ని రకాల వీడియోలు చూస్తూ.. స్క్రోల్ చేస్తుంటే దృష్టి వాటిని ఆకర్షిస్తుంది. అంతేకాదు వాటిల్లో కొన్నింటిని చూస్తుంటే అసాధ్యం అనిపిస్థాయి. మరికొన్నిటిని చూస్తుంటే వామ్మో ఇలాంటివి కూడా జరుగుతాయా ఇదేకదా సృష్టి అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఒక చేప తిన్న తిండి చూస్తే.. దానిని తిండిపోతు చేప అని పిలుస్తారు ఎవరైనా..
సన్నగా ఉన్నవారు ఎక్కువగా తినడం మీరు తరచుగా చూసి ఉంటారు. అంటే ఆహారం తినే శక్తి బలం వీరికి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు బలమైన వ్యక్తి, లావుగా ఉన్నవారు కూడా వారి తిండి పుష్టి చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అయితే జంతువులి ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయివాటిని.. వాటిని చూసినప్పుడు ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోని చేపను చూడండి. దీనిని పట్టుకున్నప్పుడు.. ఎవరూ ఊహించి ఉండరు. తాము ఒకేసారి వందల చేపలను వలలో పట్టుకున్నామని.. అంతే కాదు పాములు, తేళ్లు, పీతలు కూడా ఉన్నాయని..
どんだけ大食いなん😹😹😹 pic.twitter.com/0JXzbmIeko
— ヒロクライム🐼 (@tannokasa6) September 26, 2023
వైరల్ అవుతున్న వీడియోలో ఒక చేప కనిపిస్తుంది. ఈ చేప చూడడానికి భారీగా ఉన్నట్లు అనిపించలేదు. మధ్యస్థ పరిమాణంలో ఉంది. అయితే దీని పొట్ట మాత్రం ఓ రేంజ్ లో ఉబ్బిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నోటికి ఒక వాటర్ పైప్ ని పెట్టి ఆ చేపను బలవంతంగా వాంతు చేసుకునే చేస్తున్నారు. అప్పుడు ఆ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చేప నోటి నుండి వరసగా చిన్న పెద్ద చేపలు రావడం ప్రారంభించాయి. అంతేకాదు పాములు, పీతలు, తేళ్లు కూడా రావడంతో అది చూసిన జనం షాక్ తిన్నారు. దీన్ని చూస్తుంటే కడుపులో సముద్రంలోని ఉన్న జంతువులన్నిటిని నింపుకున్నట్లే అనిపిస్తుంది ఎవరికైనా.. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న జనం చాలా ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో X ప్లాట్‌ఫారమ్ @TheFigenలో భాగస్వామ్యం చేయబడింది. దీనిని కోటి మందికి పైగా చూశారు. దానిపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారీగా స్పందిస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశాడు, ‘ఈ దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరోకరు ఇలా వ్రాశాడు, ‘ఈ చేప తిండిపోతుగా మారింది.’ ఆంతేకాదు చాలా మంది ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ.. తమ అభిప్రాయాన్ని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..