Viral Video: కారు కింద పడిపోయిన మూడేళ్ల చిన్నారి… ఆ తర్వాత… CCTVలో యాక్సిడెంట్‌ రికార్డ్‌

గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఆ హృదయ విదారకమైన సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి మీది నుంచి ఓ కారు పోయింది. కానీ, కుటుంబ సభ్యుల అప్రమత్తత కారణంగా ఆ చిన్నారికి...

Viral Video: కారు కింద పడిపోయిన మూడేళ్ల చిన్నారి... ఆ తర్వాత... CCTVలో యాక్సిడెంట్‌ రికార్డ్‌
3 Year Old Child Rescued

Updated on: Jun 28, 2025 | 4:23 PM

గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఆ హృదయ విదారకమైన సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి మీది నుంచి ఓ కారు పోయింది. కానీ, కుటుంబ సభ్యుల అప్రమత్తత కారణంగా ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన CCTV వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ప్రమాదానాకి సంబంధించిన మొత్తం సంఘటన స్పష్టంగా కనిపిస్తోంది.

వీడియోలోని దృశ్యాలు ప్రకారం నవ్‌సరిలో, ఆ చిన్నారి తన ఇంటి బయట ఇతర పిల్లలతో ఆడుకుంటుండగా, అక్కడి నుండి ఒక కారు వస్తోంది. కారు ముందుకు కదులుతుండగా, మూడేళ్ల చిన్నారి దాని కింద పడింది. అయితే, కారు డ్రైవర్ సకాలంలో హెచ్చరిక చేసి వెంటనే బ్రేక్‌లు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇతర కుటుంబ సభ్యులు కూడా వెంటనే రంగంలోకి దిగి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు.

కారు ముందుకు కదులుతుండగా, చిన్నారి ముందు నుండి నుజ్జునుజ్జు అయ్యేలోపు వాహనం ఆగిపోయింది. ఈ మొత్తం సంఘటన CCTV కెమెరాలలో రికార్డ్‌ అయింది. సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ చిన్నారి కుటుంబం కూడా వెంటనే వచ్చి కారు కింద నుండి చిన్నారిని బయటకు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

వీడియో చూడండి: