Viral Video: సీసీటీవీ కెమెరాలో రికార్డయింది చూసి నెటిజన్స్‌ షాక్‌… బెంగళూరు రోడ్డులో షాకింగ్‌ హత్యాయత్నం!

బెంగళూరులోని న్యూ బిఇఎల్ రోడ్డులో ఒక షాకింగ్ హత్యాయత్నం సంఘటన కెమెరాలో రికార్డైంది. ఓ కారు వేగంగా వెళ్లి ఉద్దేశపూర్వకంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక జంటతో పాటు వారి చిన్న కుమారుడు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...

Viral Video: సీసీటీవీ కెమెరాలో రికార్డయింది చూసి నెటిజన్స్‌ షాక్‌... బెంగళూరు రోడ్డులో షాకింగ్‌ హత్యాయత్నం!
Murder Attempt Caught On Ca

Updated on: Nov 17, 2025 | 4:18 PM

బెంగళూరులోని న్యూ బిఇఎల్ రోడ్డులో ఒక షాకింగ్ హత్యాయత్నం సంఘటన కెమెరాలో రికార్డైంది. ఓ కారు వేగంగా వెళ్లి ఉద్దేశపూర్వకంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక జంటతో పాటు వారి చిన్న కుమారుడు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. సిసిటివి ఫుటేజ్‌లో కారు వెనుక నుండి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పారిపోతున్నట్లు చూపిస్తుంది. బెంగళూరు పోలీసులు కోడిగెహళ్లికి చెందిన డ్రైవర్ సుకృత్ గౌడ (23) ను త్వరగా గుర్తించి అరెస్టు చేసి, అతనిపై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు.

వీడియోను సమీక్షించిన తర్వాత, అధికారులు కేసును బిఎన్‌ఎస్ సెక్షన్ 109 (హత్య ప్రయత్నం) కింద అప్‌గ్రేడ్ చేసి, అతని టాటా కర్వ్ కారును స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన కుటుంబానికి తక్షణ వైద్య సహాయం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బెంగళూరులో ఉద్దేశపూర్వకంగా జరిగిన హిట్ అండ్‌ రన్ కేసుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై సోషల్‌ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డ్‌ కాకుండా ఉంటే ఏమిటి పరిస్థితి అంటూ ప్రశ్నిస్తున్నారు.

వీడియో చూడండి: