Viral Video: కూతురిని వేదించినందుకు చెప్పుతో ఉతికిన తల్లి… కేవలం 6 సెకన్లలోనే 15 సార్లు బాదుడే బాదుడు

కూతురిపై లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఓ మహిళ చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. రోడ్డు మీద జనం మధ్యే చెప్పుతో చెంపలు వాయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ఆ దుర్మార్గుడిని చెప్పులతో కొడుతుండగా వదిలేయమని...

Viral Video: కూతురిని వేదించినందుకు చెప్పుతో ఉతికిన తల్లి... కేవలం 6 సెకన్లలోనే 15 సార్లు బాదుడే బాదుడు
Mother Hits With Cheppals

Updated on: May 12, 2025 | 6:08 PM

కూతురిపై లైంగికంగా వేదిస్తున్న వ్యక్తిని ఓ మహిళ చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. రోడ్డు మీద జనం మధ్యే చెప్పుతో చెంపలు వాయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ఆ దుర్మార్గుడిని చెప్పులతో కొడుతుండగా వదిలేయమని ప్రాదేయపడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే, ఆ మహిళ ఆగలేదు. ఆ దుర్మార్గుడి క్రూరమైన చర్యకు అతన్ని కొడుతూనే ఉంది.

హమీర్‌పూర్‌లోని ముస్కారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితురాలి తల్లి ఆ యువకుడిని చెప్పులతో కొడుతోంది. ఆ మహిళ ఆ నిందితుడిని కేవలం 9 సెకన్లలో 15 సార్లు చెప్పుతో కొట్టినట్లు వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ ఆ దుర్మార్గుడిని మొత్తం 23 సార్లు కొట్టింది. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడు. బాలిక తల్లికి ఫిర్యాదు చేయడంతో రోడ్డు మీద పట్టుకుని దేహశుద్ది చేసింది. శివ కుమార్ సాహుగా గుర్తించబడిన యువకుడు బండా నివాసి. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ విషయానికి సంబంధించి బాలిక లేదా ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

అయితే, ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసు కస్టడీలో ప్రశ్నిస్తున్నారు. బాలిక లేదా ఆమె కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

వీడియో చూడండి: