Viral Video: సింహాలను ఎదుర్కొన్న ముంగీస.. వెనక్కి తగ్గిన లయన్స్!

| Edited By: Janardhan Veluru

Jan 09, 2024 | 6:32 PM

ఒక్కోసారి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రెండు విచిత్రమైన జంతువుల పోటీ నెలకొంటే చూడటానికి కూడా ఆసక్తిగా ఉంటుంది. అడవికి రాజు సింహం. తన గర్జనతో అడవిని పరిపాలిస్తూ ఉంటుంది. అలాగే ఎలాంటి ఆపదలు వచ్చినా ఎదుర్కొంటూ ఉంటుంది. అలాంటి రాజును ఎదుర్కొనాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాంటి రాజును ఓ ముంగీస ఎదుర్కొందంటే నమ్ముతారా.. అస్సలు నమ్మరు కదా..

Viral Video: సింహాలను ఎదుర్కొన్న ముంగీస.. వెనక్కి తగ్గిన లయన్స్!
Viral Video
Follow us on

ఒక్కోసారి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రెండు విచిత్రమైన జంతువుల పోటీ నెలకొంటే చూడటానికి కూడా ఆసక్తిగా ఉంటుంది. అడవికి రాజు సింహం. తన గర్జనతో అడవిని పరిపాలిస్తూ ఉంటుంది. అలాగే ఎలాంటి ఆపదలు వచ్చినా ఎదుర్కొంటూ ఉంటుంది. అలాంటి రాజును ఎదుర్కొనాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాంటి రాజును ఓ ముంగీస ఎదుర్కొందంటే నమ్ముతారా.. అస్సలు నమ్మరు కదా.. కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నమ్మి తీరతారు.

పాము – ముంగీసల గురించి తెలుసు. కానీ ఓ చిన్న ముంగీస.. సింహాన్ని ఎదిరించిందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది నిజంగానే జరిగింది. కేవలం చిన్న పిల్లి పరిమాణంలో ఉండే ఓ ముంగీస.. అడవికి రాజైన సింహాన్ని ఎదిరించింది. అలాగే సింహం చిన్న జంతువులకు భయపడటం ఎప్పుడైనా చూశారా? ముంగీస తనని తాను నిలదొక్కుకోవడం కోసం.. ఏకంగా నాలుగు సింహాలతో పోరాడింది. వాటిల్లో భయాన్ని కలిగించకలిగింది. సింహాలతో ఘర్షణ ఆడుతున్న ముంగీస వీడియోను ఇప్పుడు చూసేయండి. ఈ వీడియోను రష్యన్ X అకౌంట్ నుంచి షేర్ అయింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

నాలుగు సింహాలను ఎదుర్కొన్న ముంగీస..

ఈ వీడియోలో ఓ కలుగులో నుంచి బయటకు వచ్చింది ఓ ముంగీస. అక్కడ దాని దారికి నాలుగు సింహాలు అడ్డుగా ఉన్నాయి. దీంతో వెంటనే దాని చిన్న గొంతుతో అది అరవడం ప్రారంభించింది. ముంగీస అరవడంతో గంభీరమైన సింహాల ముఖంలో భయం బయటకు వచ్చింది. కేవలం చిన్న పరిమాణంలో ఉండే ఒక చిన్న ముంగీస.. నాలుగు సింహాలను భయ పెట్టడం.. నిజంగానే ఆశ్చర్యాన్ని కలగిస్తుంది. దాని గంభీరమైన స్వరంతో.. నాలుగు సింహాలను ఎదుర్కొంది ముంగీస. ఈ వీడియో నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.